అన్వేషించండి

Sridevi Drama Company: రెబల్ స్టార్ బర్త్ డే, మెగాస్టార్ గిన్నిస్ రికార్డ్ - ఈవారం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో రచ్చ రచ్చే!

ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే వినోదాన్ని అందించే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.. ఈవారం మరింత క్రేజీగా ఉండబోతుంది. తాజాగా విడుదలైన ప్రోమో నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

Sridevi Drama Company Promo:  ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ‘జబర్దస్త్’ కమెడియన్లు ఈ షోలో చేసే ఫన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 20న ప్రసారం కానున్న ఈ షో అందరినీ నవ్వుల్లో ముంచెత్తనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే, మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు థీమ్స్ తో ఈ వారం షో ప్రేక్షకులను అలరించబోతోంది.

ప్రభాస్ బర్త్ డే హంగామా

ప్రోమో ప్రారంభం కాగానే తాగుబోతు రమేష్, నాటి నరేష్ ప్రభాస్ గురించి అదిరిపోయే ఎలివేషన్ ఇస్తారు. “ప్రభాస్ గారికి నేను వీరాభిమానని. ఆయనంటే కోసుకుంటా. బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి” అంటారు రమేష్. ఆ వెంటనే యాంకర్ రష్మీ గౌతమ్, ఇంద్రజ ఇంట్రో ఆకట్టుకుంటుంది. కమెడియన్లు అంతా కలిసి రిచ్, పూర్ జట్లుగా విడిపోయి ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేట్ చేస్తారు. “మాకు లేదు బొచ్చు, మేం రిచ్చు” అని ఇమ్మాన్యుయేల్ చెప్పడంతో అందరూ నవ్వుతారు. ప్రభాస్ బర్త్ డే తాము సెలబ్రేట్ చేస్తామంటే, తాము చేస్తామంటూ రిచ్, పూర్ టీమ్ లు పడే గొడవ ఫన్నీగా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన పాటలకు కంటెస్టెంట్లు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. ఆయా సినిమాల్లో ప్రభాస్ చేసిన పాత్రలను హైలెట్ చేస్తూ ఇచ్చిన ఫర్ఫార్మెన్స్ అందరినీ అలరించింది. ‘కల్కీ 2898 ఏడీ’ సినిమాలోని బుజ్జి వచ్చి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసేందుకు 5 వేల యూనిట్లు కావాలని అడగడం” ఆకట్టుకుంటుంది. ఇక ప్రభాస్ సినిమాలోని పాటలను పాడుతూ సింగర్స్ ఎంటర్ టైన్ చేశారు. ఇక ఈ షోలో ఆడిన ఫన్నీ గేమ్స్ అందరినీ నవ్వించాయి.

అలరించిన మెగాస్టార్ గిన్నిస్ రికార్డ్ థీమ్

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్స్ హోల్డర్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ.. ప్రారంభం అవుతుంది. చిరంజీవి పాటలకు వేసిన డ్యాన్సులు అదరగొట్టాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మెగా రెబల్ ఎపిసోడ్ ఈ నెల 20న ఈటీవీలో మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం కానుంది.   

అటు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అటు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌ లో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురయ్యింది. హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ కొట్టారంటూ విమర్శలు వచ్చాయి.     

Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget