Soundarya Death: సౌందర్య చివరి కోరిక అదే - ఆమె వదిన చెప్పిన మాటలు వింటే గుండె బరువెక్కుతుంది
టాలీవుడ్ అగ్ర నటి సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయింది. ఆమె మరణానికి ముందు తన కోడలిని రెండు కోరికలు నెరవేర్చాలని కోరింది. అవి తీరకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రముఖ నటిగా వెలుగొందారు సౌందర్య. ఎన్నో అద్భుత చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె నటించిన సినిమాలకు ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అందం, అభినయంతో ఆడియెన్స్ ను ఇట్టే ఆకర్షించే సౌందర్య, దురదృష్టవశాత్తు ఏప్రిల్ 17, 2004న జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 27 సంవత్సరాల వయస్సులోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె ఆకస్మిక మరణంతో లక్షలాది మంది అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అభిమాన నటి సినిమాలు ఇక రావని తెలిసి కంటతడి పెట్టారు.
చనిపోయే ముందు సౌందర్య కోరికలు ఇవే!
సౌందర్య చనిపోవడానికి ముందు తన వదినతో చెప్పిన మాటలు రీసెంట్ గా వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదానికి ముందు తన వదినతో సౌందర్య మాట్లాడింది. ఈ సందర్భంగా తన కోసం ఆమెను రెండు వస్తువులు తీసుకోవాలని కోరిందట. కానీ, ఆమె కోరిన వస్తువులు తన దగ్గరికి చేకుండానే చనిపోయింది. ఆమె చివరి సారిగా తన వదినని తీసుకురమ్మని చెప్పిన వస్తువులలో ఒకటి కాటన్ చీర, మరొకటి కుంకుమ. సౌందర్య దగ్గర కాటన్ చీరలు లేకపోవడంతో తన వదిన నిర్మలను కొన్నింటిని కొనమని చెప్పిందట. అప్పటికే ఆమె బీజేపీలో చేరడంతో, ఎన్నికల ప్రచారంలో కాటన్ చీర ధరించి పాల్గొనాలని భావించిందట. ఆమెకు కుంకుమ అంటే చాలా ఇష్టం. తన నుదుటిన ఎప్పుడూ కుంకుమ పెట్టుకుని కనిపిస్తుంది. అందుకే, కాటన్ చీరతో పాటు కుంకుమ కావాలని తన వదినకి చెప్పిందట. అత్త కోసం నిర్మల వాటిని కొనాలి అనుకుందట. మార్కెట్ కు వెళ్లేందుకు రెడీ కూడా అయ్యిందట. ఆ సమయంలోనే సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయినట్లు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించిదంట. తాజాగా ఈ విషయాన్ని నిర్మల వెల్లడించింది.
Read Also: టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు వీళ్లే, ఒక్కో మూవీకి ఎంత వసూలు చేస్తారంటే?
సౌందర్య సక్సెస్ ఫుల్ సినీ కెరీర్
అందాల తార సౌందర్య ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. ఆమె తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలలో పలు అద్భుత చిత్రాలు చేసింది. హిందీ సినిమా ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. ‘సూర్యవంశం’ సినిమాలో అమితాబ్ బచ్చన్ సరసన నటించిన ఆమెను, ఈనాటికీ అక్కడి ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. ఆమె నటించిన అద్భుత చిత్రాలు ఇప్పటికీ టీవీలలో ప్రసారం అయితే, ఎంతో అద్భుత స్పందన లభిస్తుంటుంది. సౌత్ అభిమానులు మాత్రమే కాదు, బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆమె సినిమాలను బాగా ఇష్టపడుతారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అద్భుత నటనకు గాను జాతీయ చలన చిత్ర అవార్డును సైతం అందుకున్నారు. ఆమె హీరోయిన్ గా నటించడంతో పాటు కొన్ని సినిమాలను నిర్మించింది కూడా. అవి కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.