Sonu Sood: 50 కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేస్తేనే అలా చేస్తా, ఆ 'హాస్పిటల్'కి సోనూసూద్ ఆఫర్
ఈ మధ్యకాలంలో చాలా మంది తమ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయమని సోనూని సంప్రదిస్తున్నారు.
కరోనా సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. వలస కార్మికుల బాధలు చూడలేక తన సొంత డబ్బుతో వారిని స్వస్థలాలకు చేర్చారు. దేశవ్యాప్తంగా తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కష్టమని ఎవరు ట్వీట్ చేసినా.. వెంటనే స్పందించేవారు. తన టీమ్ ని అలర్ట్ చేసి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నారు. అతడిని దేవుడిలా భావించారు ప్రజలు. సోనూ సేవను గుర్తించిన చాలా మంది దాతలు ముందుకొచ్చి సోనూసూద్ ఫౌండేషన్ కి విరాళాలు అందించారు.
ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంత ఛారిటీ వర్క్ చేయడానికి సోనూకి చాలా మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. మరి ఆయన ఎలా మేనేజ్ చేస్తున్నారో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో చాలా మంది తమ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయమని సోనూని సంప్రదిస్తున్నారు. దాని ద్వారా వచ్చే రెమ్యునరేషన్ ని స్కూల్స్ కి కానీ, హాస్పిటల్స్ కి కానీ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయమని చెబుతారట సోనూసూద్.
దీనికొక ఉదాహరణ కూడా ఇచ్చారు. రీసెంట్ గా ఎస్తర్ హాస్పిటల్స్ కి చెందిన విల్సన్ అనే వ్యక్తి దుబాయ్ ట్రిప్ కి వెళ్లే సమయంలో తనతో కనెక్ట్ అయ్యాడని చెప్పారు. తమ హాస్పిటల్ ని ప్రమోట్ చేయమని.. ప్రజలకు వైద్యసదుపాయాలను అందించడంలో సాయం చేయమని కోరారట. దీంతో వారిని సోనూసూద్ ఓ రిక్వెస్ట్ చేశారట. 50 మందికి కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేయిస్తే హాస్పిటల్స్ ని ప్రమోట్ చేస్తానని చెప్పారట. ఆ ఆపరేషన్లకు మొత్తంగా రూ.12 కోట్లు ఖర్చవుతుందని.. ఆపదలో ఉండి అంత మొత్తాన్ని భరించలేని వారికి ఆపరేషన్స్ చేయాలని డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పారు సోనూసూద్.
Also Read: మహేష్ కుమార్తె డ్రీమ్ ఏంటో తెలుసా? క్లారిటీగా చెప్పిన సితార
View this post on Instagram