అన్వేషించండి

Sarkaaru Noukari: న్యూ ఇయర్‌కి సింగర్ సునీత తనయుడి సినిమా - 2024 ఓపెనింగ్ హీరో ఆకాషే!

Singer Sunitha son debut movie: ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'సర్కారు నౌకరి'. ఈ సినిమా విడుదల తేదీని ఈ రోజు వెల్లడించారు.

Sarkari Naukri Movie Release Date: ప్రముఖ గాయని, తెలుగు కోకిల సునీత గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకటా... రెండా... ఎన్నో వందల సినిమాల్లో వేల పాటలకు తన స్వరంతో ప్రాణం పోశారు ఆవిడ. ఇప్పుడు ఆమె తనయుడు వెండితెరకు పరిచయం అవుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆ సినిమాను విడుదల చేయనున్నారు. 

దర్శకేంద్రుడి చేతుల మీదుగా... 
సునీత తనయుడి పరిచయం!
Sunitha son Akash: సునీత కుమారుడి పేరు ఆకాష్. అతను హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'సర్కారు నౌకరి' (Sarkari Naukri Movie 2024). గంగనమోని శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. విశేషం ఏమిటంటే... వెండి తెరకు ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను తన దర్శకత్వంలో పరిచయం చేసిన దర్శ కేంద్రుడు కె రాఘవేంద్ర రావు... ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.  

జనవరి 1న 'సర్కారు నౌకరి'
Sarkari Naukri release date: న్యూ ఇయర్ రోజున... అంటే జనవరి 1న 'సర్కారు నౌకరి' విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆకాష్ సరసన భావనా వళపండల్ నటించారు. కథానాయికగా ఆమెకు కూడా తొలి సినిమా ఇది. కొత్త ఏడాదిన కొత్త హీరో హీరోయిన్లు నటించిన సినిమా థియేటర్లలోకి వస్తుంది అన్నమాట! 

Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!

పక్కింటి కుర్రాడిలా ఆకాష్ క్యారెక్టర్!
'సర్కారు నౌకరి' ఫస్ట్ లుక్, ఓ పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆకాష్ లుక్ చూస్తే... పక్కింటి కుర్రాడిలా కనిపిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సినిమా తెరకెక్కించారని అర్థం అవుతోంది. హీరో సైకిల్ మీద తిరగడం... చెట్టు మీద 'పెద్ద రోగం చిన్న ఉపాయం' అని రాసి ఉండటం వంటివి సినిమా మీద మరింత ఆసక్తిని పెంచాయని చెప్పాలి. ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

ప్రభాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్' డిసెంబర్ 22న విడుదల అవుతుంటే... నవంబర్ 29న కళ్యాణ్ రామ్ నందమూరి నటించిన 'డెవిల్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 1న ప్రస్తుతానికి వేరే సినిమా లేదు. మరి, సునీత కుమారుడి సినిమాకు ఏ విధమైన స్పందన లభిస్తుందో చూడాలి. కొత్త ఏడాదిలో ఆమె ఫ్యామిలీకి మంచి ఓపెనింగ్ రావాలని ఆశిద్దాం.

ఆకాష్, భావనా వళపండల్ జంటగా నటించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు: రవి, కో డైరెక్టర్ : రమేష్ నాయుడు దళే, కాస్ట్యూమ్ డిజైనర్ : రితీషా రెడ్డి, నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి, స్వరాలు: శాండిల్య, నిర్మాణం: ఆర్.కె టెలీషో ప్రైవేట్ లిమిటెడ్, ఛాయాగ్రహణం - రచన - దర్శకత్వం: గంగనమోని శేఖర్, నిర్మాత: కె. రాఘవేంద్ర రావు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్‌ వరకు
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్‌ వరకు
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్  స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
New Year - Liquor Sales : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్‌ వరకు
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్‌ వరకు
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్  స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
New Year - Liquor Sales : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Kamareddy Crime News: కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
Embed widget