News
News
X

Sidharth Malhotra Kiara Advani: సిద్ధార్థ్ మల్హోత్రా - కియార అద్వానీల పెళ్లి? వేదిక అక్కడేనా ?

సిద్దార్ధ్ మల్హోత్రా- కియార అద్వానీ జంట గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

FOLLOW US: 
 
బాలీవుడ్ జంట కియారా అద్వానీ -సిద్దార్ధ్ మల్హోత్రా ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. గత కొన్నేళ్లుగా వీరు ఇద్దరూ డేటింగ్లో ఉంటున్నారు. వీళ్ళు జంటగా ప్రేమ పేరుతో ముంబై మొత్తం చుట్టేశారు. మాల్దీవుల పర్యటన రొమాంటిక్ వెకేషన్ దగ్గర నుంచి `షేర్షా` వరకూ ఏ రేంజ్లో వైరల్ అయ్యారో చూసే ఉంటారు. దీంతో వాళ్లకు విడదీయరాని బాండింగ్ ఏర్పడింది. అయితే వీరి పెళ్లిపై చాలా వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడూ వీళ్ళు బయటపడలేదు. వీరి జంట గురించి ఓ వార్త ఇప్పుడు బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ త్వరలోనే ఒక్కటవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లోనే వీరిరువు పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. 

వీరి పెళ్లి ఎప్పుడు ఎక్కడ అనే దానికి ఇప్పటికి స్పష్టత లేదు. అయితే బాలీవుడ్ నుంచి కొంత సమాచారం సర్కిల్ అవుతోంది. అయితే గుజరాత్లోని ఒబేరాయ్ సుఖ్ విల్లా స్పా రిసార్ట్ ను  వివాహ వేడుక కోసం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇక్కడే బాలీవుడ్ కు చెందిన రాజ్ కుమార్-పత్రలేఖ వివాహం కూడా జరిగింది. అయితే ముందు గోవా లో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేయాలని ఆలోచించినా తర్వాత సిద్దార్థ్ ఫ్యామిలీ ను పరిగణలోకి తీసుకుని గుజరాత్ కు మారినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రాలేదు. వారి నుంచి ఏ అధికారిక సమాచారం వెలువడలేదు.

సిద్దార్థ-కియార ప్రేమ వ్యవహారం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. వీరిపై ముంబై మీడియా రకరకాల కథనాలు రాస్తూ వస్తోంది. వీరు ఇద్దరు ఈ ఏడాది ప్రారంభంలో సీక్రెట్గా మాల్దీవులకు వెళ్లిడం, పలు మార్లు కియార, సిద్దార్థ ఇంటి దగ్గర కెమెరాలకు చిక్కడంతో వీరిపై మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వీరు నిరంతరం పెళ్లి గురించి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా 'కాఫీ విత్ కరణ్ 7'లో పాల్గొన్నారు. అప్పుడు కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు కియారా వేరే రకంగా సమాధానం ఇచ్చింది. నిజానికి తాము స్నేహితుల కంటే ఎక్కువ అని చెప్పింది. ఎంత ఎక్కువ అని అడిగితే కియారా దానికి సమాధానం ఇవ్వలేదు. 

హిందీలో 'ఎం.ఎస్.ధోని' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కియార తర్వాత తెలుగులో 'భరత్ అనే నేను' తో సినిమాలో కూడా నటించింది. తెలుగులో పలు సినిమాల్లో నటించినా హిందీలోనే ఆమెకు ఎక్కువ పాపులార్టీ పెరిగింది. దీంతో వరుస సినిమాలు చేస్తోంది కియార. బాలీవుడ్‌లో అనతికాలంలోనే బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది కియార. అయితే కియారా-సిద్దార్థ జంటగా నటించిన 'షేర్ షా' సినిమాతో వీరి మధ్య బంధం బలపడింది. అంటే కేవలం ఈ ఒక్క సినిమాతోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టేసిందా అనుకుంటే పొరపాటే,  ఎందుకంటే ఈ సినిమాకి ముందే వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందని టాక్.  ముందునుంచే డేటింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారట. కియార ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నటిస్తోంది. మరి సిద్దార్థ్-కియార పెళ్లి పై వస్తోన్న వార్తలపై వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.

News Reels

Published at : 03 Nov 2022 12:47 PM (IST) Tags: Kiara Advani Sidharth Malhotra

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు