News
News
X

మేకప్ రూమ్‌లో నటి ఆత్మహత్య కేసులో కీలక మలుపు - సహ నటుడు షీజన్ ఖాన్ అరెస్ట్

సీరియల్ నటి తునీష శర్మ హత్య కేసులో పోలీసులు.. ఆమె మాజీ ప్రియుడు షీజన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.

FOLLOW US: 
Share:

సీరియల్ నటి తునీషా శర్మ ఆదివారం ఓ టీవీ షోలోని మేకప్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో పోలీసులు సహ నటుడ షీజన్ మహమ్మద్ ఖాన్‌ను అరెస్టు చేశారు. 

మహారాష్ట్రలోని వాసై ప్రాంతంలో జరుగుతున్న ఓ టీవీ షోలో పాల్గొన్న తునీషా.. అప్పటివరకు బాగానే కనిపించింది. మేకప్ వేసుకుని షూటింగ్‌లో నటించింది కూడా. అకస్మాత్తుగా ఏమైందో ఏమో.. మేకప్ రూమ్‌లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెతో కలిసి వివిధ సీరియల్స్, షోస్‌లో నటిస్తున్న  షీజన్ మహమ్మద్ ఖాన్‌ను అరెస్టు చేశారు. మరో సహ నటుడు పార్థ్ జుట్షీని కూడా విచారించారు షీజన్‌ను సోమవారం కోర్టులో హాజరుపరచనున్నారు. 

ప్రేమ - బ్రేకప్ వల్లే ఆత్యహత్య?

ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తునీషా శర్మ, షీజన్ ఖాన్‌లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 15 రోజుల కిందట వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. అప్పటి నుంచి తునీషా శర్మ మానసికంగా కుంగిపోయింది. అందుకే ఆమె ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. తునీషా భౌతిక కాయానికి ముంబయిలోని జేజే హాస్పిటల్‌లో శవ పంచనామా జరిపారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, asphyxiation (ఊపిరి ఆడకపోవడం) వల్లే ఆమె చనిపోయిందని వెల్లడైంది. 

మేకప్ రూమ్‌లో కాదు వాష్ రూమ్‌లో..

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆమె మేకప్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు ఆమె వాష్ రూమ్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని, ఎంతకీ తలుపులు తెరవకపోతే సిబ్బందికి అనుమానం తలుపులు బద్దలకొట్టి చూస్తే ఉరివేసుకుని కనిపించిందన్నారు. హాస్పిటల్‌కు తరలించేలోపే ఆమె ప్రాణాలు విడిచిందన్నారు. షూటింగ్ సిబ్బంది ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని, అయితే ఘటన స్థలిలో తమకు సూసైడ్ నోట్ లభించలేదన్నారు. హత్య, లేదా ఆత్మహత్య అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. తునీషా శర్మ మరణవార్త విని ఆమె తల్లి షాకయ్యారని, తమ కూతురు మరణానికి షీజాన్ ఖాన్ కారణమంటూ తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. 

Also Read: చికెన్ బిర్యానీ తిని, ప్లేట్ ఇచ్చి హ్యాపీగా కన్నుమూశారు - అంత్యక్రియలు 28న: రవిబాబు

View this post on Instagram
 
A post shared by Tunisha Sharma (@_tunisha.sharma_)

Published at : 25 Dec 2022 02:08 PM (IST) Tags: Tunisha Sharma Tunisha Sharma Suicide Sheezan Khan Tunisha Sharma Case

సంబంధిత కథనాలు

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?

Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?

Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్

Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్

Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?

Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ -  అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

టాప్ స్టోరీస్

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!

Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు

Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు