Sharwanand: నీ మొగుడు ఏమన్నా మహేష్ బాబా? కాపురం చేయలేదా? పిల్లల్ని కనలేదా?
శర్వానంద్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టైటిల్ సాంగ్ నేడు విడుదలైంది. విన్నారా?
యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఆయనకు జోడీగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ రోజు సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు.
'హే లక్షమమ్మో... పద్మమ్మో... శాతంమ్మో...
శారదమ్మో... గౌరమ్మో... కృష్ణమ్మో...
నా బాధే వినావమ్మో! ఈ గోలే ఎందమ్మో?
ఈ గోలే చాలమ్మో! ఓలమ్మో... ప్లీజిమ్మో!
నా బతుకే బుగ్గయ్యనమ్మో!
నీ మొగుడేమన్నా మహేష్ బాబా?
పోనీ, అందానికేమైనా బాబా!
చెయ్ లా? కాపురం చెయ్ లా?
కన్ లా? ఇద్దర్ని కన్ లా'
అంటూ సాగిన ఈ గీతాన్ని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా ఆలపించారు. ఈ పాటను శ్రీమణి రాశారు. తనకు పెళ్లి కాకపోవడానికి కారణమైన ఆడవాళ్ల అందరి మీద హీరోకి ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను హీరో ఈ పాటలో చూపించారు. ఆడవాళ్లను హీరో నిందిస్తున్నట్టు కనిపిస్తోంది.
'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' సినిమాలు తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కిషోర్ తిరుమల సినిమాను తెరకెక్కించారట. ఆల్రెడీ శర్వానంద్, రష్మిక జోడి అనేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. టైటిల్ వల్ల ఈ సినిమాలో మహిళలకు మంచి ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది.
ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ ప్రధాన పాత్రల్లో, 'వెన్నెల' కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్.
View this post on Instagram