Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్
‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో హీరోయిన్ గొడవపడ్డారు. అందరూ చూస్తుండగా ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు.
మూగ అమ్మాయి అమ్ములుగా 'మౌనరాగం' సీరియల్ తో బుల్లితెరకి పరిచయం అయ్యింది ప్రియాంక జైన్. ఇప్పుడు ‘జానకి కలగనలేదు’ సీరియల్ లో జానకిగా అందరినీ అలరిస్తోంది. తన తండ్రి ఐపీఎస్ కల నెరవేర్చే కూతురిగా, బాధ్యత కలిగిన ఒక కోడలిగా, చక్కని భార్యగా జానకి పాత్రని పోషిస్తుంది ప్రియాంక జైన్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ‘నెవర్ ఎండింగ్ టేల్స్’ పేరుతో యూట్యూబ్ లో ఒక ఛానెల్ పెట్టింది. అందులో తనకి సంబంధించిన ప్రతి వీడియో పోస్ట్ చేస్తుంది. ‘మౌనరాగం’ సీరియల్ హీరో శివ కుమార్ ని ప్రేమించింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతుంది.
తాజాగా ప్రియాంక జైన్ పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ‘జానకి కలగనలేదు’ హీరో అమర్ దీప్, ప్రియాంక జైన్ కాస్త సీరియస్‌గానే పోట్లాడుకున్నారు. వారు అలా మాటలు అనుకోవడం చూసి షూటింగ్ టీమ్ కూడా నోరెళ్లబెట్టారు. అయితే, వారి గొడవ ప్రాంక్ అని తెలియగానే ఆశ్చర్యపోయారు.
అంతా ఉత్తిదే.. ప్రాంక్!!
‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్ దీప్(రామా) తో కలిసి షూటింగ్ సెట్ లో ప్రాంక్ చేసింది. ప్లాన్ ప్రకారమే అమర్ దీప్, ప్రియాంక జైన్ గొడవపడ్డారు. పాపం, అది నిజమని తెలియక అందరూ నమ్మేశారు. వాళ్ళు నిజంగానే గొడవపడుతున్నారని అనుకుని ఆపేందుకు ట్రై చేశారు. కానీ.. చివర్లో అదంతా ప్రాంక్ వీడియో అని తెలిసి టీం బిక్కమొహాలు వేసేశారు.
అసలేం జరిగిందంటే.. జానకి, రామా ప్లాన్ ప్రకారం అందరి ముందు గొడవపడినట్లుగా నటించారు. ‘‘ప్రతిదీ మీరు చెప్పినట్టే చేయడం కుదరదు’’ అని జానకి.. రామాతో వాదనకి దిగింది. ఇలా అయితే ప్రతిసారీ చేయలేనని అనేసింది. దానికి రామా ఎందుకు తనంత ఓవర్ యాక్షన్ చేయడం అని అన్నాడు. ఓవర్ యాక్షన్ ఎవరు చేస్తున్నారని జానకి అనేసరికి మీరే చేస్తున్నారని రామా గట్టిగా అన్నాడు. వాళ్ళ గొడవ విని అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రామా పక్కనే మల్లిక, గోవిందరాజులు ఉంటారు. మల్లిక రామాని ఆపేందుకు చూస్తుంది. విసిగిపోయిన జానకి ఇలా అయితే షూటింగ్ చేయలేమని సీరియస్ అయ్యింది. ఇది ఎంత వరకు వెళ్తుందో అని అందరూ కంగారుగా చూస్తూ ఉంటే జానకి చివర్లో ఇది ప్రాంక్ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. తన తమ్ముడు మంచోడు ఇలా మాట్లాడడు అని మల్లిక వెనకేసుకొచ్చింది.
తర్వాత జానకి సీరియల్ కోసం పడే పాట్లు ఎలా ఉంటాయో చూపించారు. పొలాల్లో ఎండకి తిరగడం ఎలా ఉంటుందో తమ బాధలు ఏంటో చెప్పుకొచ్చారు. సీరియల్ లో అమాయకంగా కనిపించే రామా బయట మాత్రం ఫుల్ గా అల్లరి చేస్తూ కనిపించాడు. సెట్లో అందరూ తోటి వారితో కలిసిపోయి ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు. ఈ సీరియల్ షూటింగ్ వల్ల బెండకాయలు ఎలా కాస్తాయో తెలుసుకుంది మన జానకి. మొదటి సారి బెండకాయ తోటని చూసి చిన్న పిల్లలాగా అల్లరి చేసేసింది. మరి మీరు రామా, జానకి అల్లరి చూడాలని అనుకుంటున్నారా అయితే ఇదిగో వీడియో ఓ లుక్కేయండి..
Also Read: పోలీస్ ఆఫీసర్‌గా మాధురి కేసు తీసుకోమన్న రామా - రంగంలోకి దిగిన జానకి ఐపీఎస్