అన్వేషించండి

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

'గాడ్ ఫాదర్'లో సత్యదేవ్ నటించారు. ఆయనది నయనతారకు భర్త పాత్ర. చిరంజీవిని ఢీ కొట్టే పాత్ర! చిరు, సల్మాన్‌తో పోరాడే పాత్ర! అక్టోబర్ 5న సినిమా విడుదల కానున్న సందర్భంగా సత్యదేవ్‌తో ఇంటర్వ్యూ...

'గాడ్ ఫాదర్' (Godfather) సినిమాలో సత్యదేవ్ (Satyadev) నటించారు. అదీ తన అభిమాన  కథానాయకుడు చిరంజీవిని ఢీ కొట్టే పాత్రలో! నయనతారకు భర్తగా ఆయన కనిపించనున్నారు. అక్టోబర్ 5న దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ (Satyadev Interview)తో ఇంటర్వ్యూ...

మీ అభిమాన కథానాయకుడు చిరంజీవితో నటించే అవకాశం ఎలా వచ్చింది? 
అన్నయ్య (చిరంజీవి) వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఫోన్ వచ్చింది... 'లంచ్ కి వస్తావా? మాట్లాడాలి' అని! నేను వెళ్లాను. అప్పుడు నాకు అన్నయ్య కథ చెప్పడం స్టార్ట్ చేశారు. నోరెళ్ళబెట్టి వింటున్నాను... 'అన్నయ్య నాకు కథ చెప్పడం ఏమిటి?' అని! నేను అన్నయ్యకు వీరాభిమానిని. ఆయన్ను గుర్తువుగా భావించిన వ్యక్తిని. ఆయన నాకు కథ, క్యారెక్టర్ వివరిస్తుంటే... అదొక అద్భుతమైన అనుభూతి. కొంత సేపు కథ చెప్పక... 'సారీ నేను కథ సరిగా చెప్పడం లేదా? నీ ఫేస్ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది' అని అన్నయ్య అడిగారు. అప్పుడు 'మీరు ఏం చెప్పారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు' అన్నాను. 'అయితే దర్శకుడితో చెప్పిస్తా' అన్నారు. 'లేదు అన్నయ్య! మీరు కథ చెబుతుంటే నాకు విజువల్ మాత్రమే కనిపించింది. వాయిస్ కట్ అయ్యింది' అని చెప్పాను.

మెగాస్టార్ చిరంజీవిని కలవాలనేది, ఆయనతో నటించాలనేది నా కల. ఆయన నాకు కథ చెప్పడం ఏమిటి? 'మీరు కథ చెప్పడం ఎందుకు? నేను చేస్తున్నాను' అని చెప్పాను. ఆ తర్వాత 'లూసిఫర్' చూశావా? అని అడిగారు. చూడలేదని చెప్పా. ఒకసారి చూడమన్నారు. 'ఎందుకు?' అని అడిగితే... 'నీకు క్యారెక్టర్ అర్థం అవుతుంది' అని చెప్పారు. అప్పుడు 'నేను ఈ సినిమా చేస్తున్నాను. మళ్ళీ ఎందుకు చూడటం?' అని చెప్పాను. ఇప్పటికీ నేను 'లూసిఫర్' చూడలేదు. అన్నయ్య కథ చెప్పినప్పుడు... సినిమా చేయమని అడిగినప్పుడు... క్యారెక్టర్ తాలూకూ రెస్పాన్సిబిలిటీ, ఆ గ్రావిటీ నాకు అర్థం కాలేదు. తర్వాత మెల్లమెల్లగా అర్థం అయ్యింది. అప్పుడు టెన్షన్ మొదలైంది.

చిరంజీవి మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ నటనను మీ అభిమాన హీరో ప్రశంసించడం ఎలా అనిపించింది?   
నా ఫీలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన్ను ఇష్టపడ్డాను. ఆయనపై ఉన్న ప్రేమతో నేను నటుడు అయ్యాను. మనకు వయసుతో పాటు డ్రీమ్స్ మారుతుంటాయి. కొన్ని కలలు మాత్రం చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తాయి. అటువంటి కల ఇది. నా సంతోషం, నా మనసులో భావాలను కొన్ని మాటల్లో వర్ణించలేను.

మీది ఏమో విలన్ రోల్. మీ అభిమాన హీరోతో, ఆయనకు ప్రతినాయకుడిగా నటించేటప్పుడు ఎలా అనిపించింది?
లక్ష్మీ భూపాల్ డైలాగులు రాసేశారు. దర్శకుడు మోహన్ రాజా గారు మానిటర్ ముందు కూర్చుని యాక్షన్, కట్ చెబుతున్నారు. (నవ్వుతూ...) యుద్ధభూమిలో ఉన్నది నేను, డైలాగులు చెప్పాల్సింది నేను!

అంటే.... సెట్స్‌లో కష్టమైందా?
అన్నయ్యకు కూడా తెలుసు కదా... 'వీడికి కొంచెం టెన్షన్ ఉంటుంది' అని! నన్ను చాలా ఈజ్‌లో పెట్టి సీన్స్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో, నా క్లోజప్స్‌లో అన్నయ్య ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఉండరు కాబట్టి ఈజీగా చేసేయవచ్చని అనుకున్నాను. అయితే, నాకు సపోర్ట్‌గా ఉంటుందని, హెల్ప్ అవుతుందని అన్నయ్య ఉండేవారు. ఆయనకు తెలియదు కదా... నాకు ప్యాక్ అవుతుందని! అన్నయ్య నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను తక్కువ చేసేలా చేయలేదు.

స్టార్ హీరో సినిమా అంటే హీరోయిన్‌తో పాటలు, రొమాన్స్ ఆశిస్తారని అంటుంటారు. ఫ్యాన్స్ కోసమే అవన్నీ అంటారు. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ లేరు. డ్యూయెట్స్ లేవు. చిరంజీవి ప్రయోగం చేస్తున్నారు. అభిమానులు చూస్తారంటారా? చిరంజీవి అభిమానిగా చెప్పండి!
వందశాతం చూస్తారు. స్క్రీన్ మీద చిరంజీవి ఉంటే చాలు. హీరోయిన్, డ్యూయెట్స్ ఎందుకు ఉన్నాయంటే... అన్నయ్య ఉన్నారు కాబట్టి! ఆయన్ను చూడటానికి ఫ్యాన్స్ వస్తారు. అభిమానుల కోసం 'తార్ మార్ టక్కర్ మార్' సాంగ్ పెట్టారు. ఇవి పక్కన పెడితే... హీరోయిన్ కంటే అన్నయ్యను చూడటం కోసం ప్రేక్షకులు వస్తారు. ఇంటర్వెల్ అయితే విపరీతమైన హై ఇస్తుంది. అందులో నో డౌట్!

మీరు ఇంటర్వెల్ గురించి చెబుతున్నారు... క్లైమాక్స్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్, మీకు మధ్య 14 నిమిషాల ఫైట్ హైలైట్ అవుతుందని విన్నాం!
అవును! ఈ రోజే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశాను కదా... ఎంత చెప్పాలో, ఏం చెప్పాలో తెలియదు. సినిమా అంతా ఆద్యంతం ఎత్తుకు పైఎత్తు వేసేలా సన్నివేశాలు ఉంటాయి. నేను సవాల్ విసురుతాను. నాకు రివర్స్‌లో వస్తాయి. మీరు చెప్పినట్లు 14 మినిట్స్ ఫైట్స్ హైలైట్. అందులో డౌట్ లేదు. దాన్ని మించి సినిమాలో ఇంకా ఉన్నాయి. 

చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార... స్టార్స్ మధ్యలో మీరు నటించడం, దీనికి నెటిజన్స్ నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది?
మీరు చెప్పిన స్టార్స్ అందరూ కొట్టుకునేది గడ్డిపరక లాంటి నా గురించి! చాలా మంది సందేహాలు ఉంటాయి. వాళ్ళందరికీ చెప్పేది ఒక్కటే... నేను మెగాస్టార్ ఫ్యాన్. ఆయన నటించిన వంద సినిమాలు చూసి నేను ఈ రోజు యాక్టర్ అయ్యాను. అంచనాలను అందుకునేలా నా నటన ఉంటుంది. 'జ్యోతిలక్ష్మి' షూటింగ్ చేసేటప్పుడు పూరి జగన్నాథ్ గారు 'నీకు డ్యాన్స్ వచ్చా?' అని అడిగారు. ఎక్కడా నేర్చుకోలేదని చెప్పాను. ఆ తర్వాత 'నేను మెగాస్టార్ ఫ్యాన్' అన్నాను. 'అయితే వస్తుందిలే... రా' అన్నారు. చిరంజీవిని చూసి చూసి తెలియకుండానే మన బాడీ లాంగ్వేజ్ కొంత మారుతుంది. అన్నయ్యను తగ్గించేలా నా నటన ఉండదని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. 

ప్రేక్షకుల్లో సందేహాలు మీ వరకూ వచ్చాయా?
వచ్చాయి. విన్నాను. అయితే... నా కాన్ఫిడెన్స్ నాది! నేను ఏం చేయగలనో, ఏం చేశానో నాకు తెలుసు. చిరంజీవి స్థాయిని తగ్గించేలా, ఆయన్ను కిందకు దించేలా నటించలేదు.

వెండితెరపై చూసిన చిరంజీవికి, సెట్స్‌లో చూసిన చిరంజీవికి మీరు గమనించిన వ్యత్యాసం ఏమిటి? గమనించిన అంశాలు ఏమిటి?
అన్నయ్యను మెగాస్టార్ అని ఎందుకు అంటారనేది సెట్స్‌లో చూస్తే అర్థమైంది. ఆ టైటిల్ ఇన్నేళ్ళుగా ఒక మనిషి దగ్గర ఎందుకు ఉందనేది అర్థమైంది. అన్నయ్య చాలా క్రమశిక్షణతో ఉంటారు. సెట్స్‌లో యంగెస్ట్ పర్సన్ అంటే ఎక్కువ ఎనర్జీతో ఉంటారు. సెట్ మొత్తం తిరుగుతారు. తర్వాత సన్నివేశం కోసం లైన్స్ ప్రిపేర్ అవుతారు. ప్రాంప్ట్ తీసుకోరు. వెండితెరపై అన్నయ్యను చూసి అభిమాని అయ్యా. ఆఫ్ స్క్రీన్ ఆయన్ను చూశాక మరింత ప్రేమ పెరిగింది. 

Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

మీకు చిరంజీవి సలహాలు ఇచ్చారా?
చాలా ఇచ్చారు. ఆయన ప్రతి సలహా వెనుక 40, 45 ఏళ్ళ అనుభవం కనిపించింది. ఆయన చెప్పే చిన్న చిన్న సలహాలు స్క్రీన్ మీదకు వచ్చేసరికి ఎంతో ఎఫెక్ట్ చూపించేవి. 

హీరోలు అందరితో చేశారు. ఎన్టీఆర్, బన్నీతో ఎప్పుడు?
నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. ఎన్టీఆర్, బన్నీ అంటే చాలా ఇష్టం! ఎప్పుడు అవకాశం వచ్చినా చేయడానికి రెడీ!

'గుర్తుందా శీతాకాలం', 'కృష్ణమ్మ', 'ఫుల్ బాటిల్'... మీరు సోలో హీరోగా నటించిన సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. హీరోగా అవకాశాలు వస్తున్నాయి. నెక్స్ట్ క్యారెక్టర్స్ వస్తే చేస్తారా? సోలో హీరోగా కంటిన్యూ అవుతారా?
బిర్యానీ, పెరుగన్నం పక్క పక్కన పెడితే... బిర్యానీ తింటాం. అలా సోలో హీరోగా చేయాలని నాకు స్వార్థం ఉంటుంది. అదే సమయంలో అద్భుతమైన క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. నన్ను ఎగ్జైట్ చేసే క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తా. నేను ఉదయం నాలుగైదు గంటలకు నిద్రలేవలేను. క్యారెక్టర్ నన్ను నిద్రలేపితే... చేయడానికి రెడీ! ఓపెన్ టు ఆల్... అయితే మోర్ బిర్యానీ! నాకు రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాథ్ గారితో చేయాలని ఉంటుంది. అదే సమయంలో బలమైన కథలు ప్రేక్షకులకు చెప్పాలనేది నా కోరిక. ఒక 'బాహుబలి', ఒక 'నాయకుడు', ఒక 'ఆపద్బాంధవుడు' లాంటి కథలు చెప్పాలి. 

Also Read : 'రామ్ సేతు'లో ఫన్ లవింగ్ రోల్ - సత్యదేవ్ మేజర్ అప్‌డేట్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget