By: ABP Desam | Updated at : 04 Feb 2023 07:49 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Masaba/Instagram
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, బాలీవుడ్ నటి నీనా గుప్తా ముద్దుల కూతురు మసాబా గుప్తా గత నెల 27(జనవరి 2023)న బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇద్దరూ తమ ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఇవాళ ఉదయమే నా శాంతి సముద్రాన్ని పెళ్లి చేసుకున్నాను" అంటూ మసాబా ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
అందరికీ చెప్పే పెళ్లి చేసుకున్నాం- సత్యదీప్
మసాబా, సత్యదీప్ పెళ్లి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా జరగడంపై పలు ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. వీరి పెళ్లి రహస్యంగా జరిగినట్లు పలు వెబ్ పోర్టల్స్ వార్తలు రాశాయి. ఈ వార్తలపై తాజాగా సత్యదీప్ స్పందించారు. తన పెళ్లి రహస్యంగా జరగలేదని చెప్పారు. 'స్పెషల్ మ్యారేజ్ యాక్ట్' ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహానికి 30 రోజుల ముందు నోటీసు పెట్టామని వెల్లడించారు. పెళ్లి తర్వాత పార్టీకి తన బంధు, మిత్రులను కూడా పిలిచినట్లు వెల్లడించారు. ఇందుకోసం వారికి నెల రోజుల ముందుగానే ఆహ్వానం పలికినట్లు వివరించారు. అటు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని ముందుగానే అనుకున్నట్లు మసాబా చెప్పింది. పెళ్లి తర్వాత కూడా పార్టీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని భావించలేదని వెల్లడించింది. కొంతమంది దగ్గరి మిత్రులు, బంధువుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు వివరించింది.
ఇద్దరికీ రెండో పెళ్లే!
మసాబా గుప్తా, ‘మసాబా మసాబా’ అనే షో చేస్తున్నది. ఈ షోలో భాగంగానే సత్యదీప్ తో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. గత మూడు సంవత్సరాలుగా వీరి ప్రేమాయణం కొనసాగుతోంది. తాజా పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి రెండో పెళ్లే కావడం విశేషం. ప్రొడ్యూసర్ మధు మంతెనను పెళ్లి చేసుకుని మసాబా విడాకులు తీసుకుంది. అటు నటి అదితి రావు హైదరీని పెళ్లి చేసుకుని విడిపోయాడు సత్యదీప్ మిశ్రా.
విన్ రిచర్డ్స్, నీనా గుప్తా ముద్దుల కూతురు మసాబా గుప్తా
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, బాలీవుడ్ నటి నీనా గుప్తా ఒకప్పుడు ప్రేమాయణం కొనసాగించారు. పెళ్లి చేసుకోకపోయినా, వీరికి ఓ అమ్మాయి పుట్టింది. తనే మసాబా గుప్తా. ప్రస్తుతం ఈమె డిజైనర్ గా పనిచేస్తోంది. అటు సత్యదీప్ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నాడు.
Read Also: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్
Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!
BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్‌ఎస్
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!