అన్వేషించండి

Satyabhama Movie: మహిళలకు ఫ్రీగా మూవీ టికెట్స్- ‘సత్యభామ’ టీమ్ బంఫర్ ఆఫర్

‘సత్యభామ’ చిత్రబృందం మహిళా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో ఉచితంగా టికెట్స్ అందజేశారు. అయితే, ఓ చిన్న కండీషన్ పెట్టారు.

‘Satyabhama’ Makers Give Free Tickets To Womens: అందాల చందమామ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. పెళ్లి తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, సెకెండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘సత్యభామ’ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలో ఈ మూవీ విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ భారీగా అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి మరింత హైప్ క్రియేట్ చేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది.

మహిళలకు ఉచితంగా ‘సత్యభామ’ మూవీ టిక్కెట్లు

జూన్ 5న ‘సత్యభామ’ సినిమాకు సంబంధించి హైదరాబాద్ మల్టీఫ్లెక్స్ లో స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ సందర్భంగా మేకర్స్ మహిళా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. సినిమా చూడ్డానికి వచ్చిన వారికి ఉచితంగా టిక్కెట్లు అందించారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఉచితంగా టిక్కెట్లు అందించారు.    

SHESafe యాప్‌ డౌన్‌ లోడ్ చేసుకుంటేనే ఫ్రీ టిక్కెట్

‘సత్యభామ’ సినిమా టిక్కెట్లు ఫ్రీగా పొందేందుకు మేకర్స్ ఓ చిన్ని కండీషన్ పెట్టారు. SHESafe అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి చెప్పారు. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారికే ఉచిత టిక్కెట్లు ఇచ్చారు.  సొసైటీ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) ప్రారంభించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ SHESafe యాప్‌ అనేది మహిళలకు భద్రత కల్పించే యాప్. ఆపదలో ఉన్న సమయంలో ఈ యాప్ బటన్ నొక్కితే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుంది. సమస్య నుంచి కాపాడే అవకాశం ఉంటుంది.   

జూన్ 7న ‘సత్యభామ’ సినిమా విడుదల

సుమన్ చిక్కాల ‘సత్యభామ’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా రూపొందిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానుంది. శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి  స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. ‘గూఢచారి’, ‘మేజర్’ చిత్రాలతో ఫేమస్ అయిన శశి కిరణ్ తిక్క ‘సత్యభామ’ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. కాజల్ అగర్వాల్ తొలిసారి యాక్షన్‌తో కూడిన పాత్రలో నటిస్తుంది. ఆమె ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నట్లు చెప్పారు శశి కిరణ్. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయన్నారు. పోలీసు అధికారి పాత్రలో కాజల్ అలరిస్తుందన్నారు. ‘సత్యభామ’ సినిమాను అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది.  ఈ సినిమా కోసం కాజల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Read Also : కంగనా రనౌత్‌ కు చెంప దెబ్బ - CISF జవాన్ చేసిన పనికి అంతా షాక్, జరిగింది ఇదేనంటూ నటి వివరణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget