అన్వేషించండి

Sara Ali Khan: ఎయిర్ పోర్టులో సారాకు చేదు అనుభవం, అసభ్యంగా టచ్ చేసిన అభిమాని

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ అభిమాని ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినీ తారలు జనాల్లోకి వచ్చినప్పుడు పలు రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. హీరోయిన్లకు అయితే ఇబ్బందులు కాస్త ఎక్కువే ఉంటాయి. వారితో సెల్ఫీలు దిగేందుకు వచ్చి, అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది బాలీవుడ్ క్యూట్ బ్యూటీ సారా అలీ ఖాన్.

ముంబై ఎయిర్ పోర్టులో సారాకు చేదు అనుభవం

ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో సారాకు చేదు అనుభవం ఎదురయ్యింది. విమానాశ్రయం నుంచి ఆమె బయటకు వస్తుండగా అభిమానులు ఆమె చుట్టూ గుమిగూడారు.  ఆమెతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అందరికీ ఓపికగా సెల్ఫీలు ఇచ్చింది సారా. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వారి వరకు అడిగిన వారికి కాదనకుండా ఫోటోలకు పోజులిచ్చింది. ఇదే సమయంలో ఓ యువతి ఆమెతో షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఆమె ముఖంతో పాటు భుజాలను తాకేందుకు ప్రయత్నించింది. ఆమె వింత ప్రవర్తనకు సారా షాక్ అయ్యింది. అయినా, ఏమాత్రం కోప్పడకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.   

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సారా సంయమనానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. అభిమానులు అనే పేరుతో పిచ్చిగా ప్రవర్తించినా, ఎంతో ఓపికతో ఉందని కామెంట్స్ పెడుతున్నారు. “సారా ఎంతో మర్యాదగా ప్రవర్తించింది. ఆమె చదువు, సంస్కారానికి నిదర్శనం. హ్యాట్సాప్ సారా” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు."ఆమె తన అభిమానుల పట్ల చాలా ప్రేమను కనబరుస్తుంది. కానీ, కొంతమంది తప్పుడు వ్యక్తులు చెడుగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఆమెకు భద్రత ఉండాలి" అని మరొకరు కామెంట్ చేశారు.

గతంలోనూ సారాకు చేదు అనుభవాలు

ఇప్పుడే కాదు, గతంలోనూ సారాకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ముంబై ఎయిర్ పోర్టులోనే ఓ అభిమాని ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ దిగే నెపంతో ఆమె నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన సారా వెనక్కి వెళ్లింది. కానీ, కంట్రోల్‌ తప్పకుండా కూల్‌గా ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. మరోసారి జిమ్ నుంచి బయటకు వస్తున్న వేళ చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ఆమె చేతిని పట్టుకుని  ముద్దాడబోయాడు. దీంతో షాక్ కు గురైన ఆమె తన చేతిని వెనక్కు లాగేసుకుంది.

సారా సినిమాల గురించి..   

సారా అలీ ఖాన్ 2018లో ‘కేదార్‌నాథ్‌’ చిత్రంలో తొలిసారిగా నటించింది.  మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అక్షయ్ కుమార్, ధనుష్‌ తో కలిసి ‘అత్రంగి రే’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.  ఇటీవలే విక్కీ కౌశల్ సరసన ' జర హాట్కే జర బచ్కే' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. 

Read Also: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్, ‘నా సామిరంగ’ అనేలా నాగ్ కొత్త మూవీ అనౌన్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
Illu Illalu Pillalu Serial Today August 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
Meghasandesam Serial Today August 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget