News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Sapta Sagaradaache Ello Side B Review - 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' ఆడియన్స్ రివ్యూ : బెంగళూరు జనాలు ఏమంటున్నారంటే? 

Sapta Sagaradaache Ello Side B Review Twitter : రక్షిత్ శెట్టి హీరోగా నటించడంతో పాటు నిర్మించిన 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' ప్రీమియర్ షోలు బెంగళూరులో పడ్డాయి.

FOLLOW US: 
Share:

Sapta Sagaradaache Ello Side B Premiere Show Response : కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన తాజా సినిమా 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'. కన్నడతో పాటు తెలుగులోనూ విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'సప్త సాగరాలు దాటి సైడ్ ఏ' సినిమాకు సీక్వెల్ ఇది. ఈ రోజు థియేటర్లలో విడుదల అయ్యింది. 

కన్నడలో 'సప్త సాగర దాచె ఎల్లో - సైడ్ బి' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం సినిమా విడుదల అయితే... గురువారం రాత్రి బెంగళూరులో ప్రీమియర్ షోలు వేశారు. రక్షిత్ శెట్టితో పాటు హీరోయిన్లు రుక్మిణీ వసంత్, చైత్ర జె ఆచార్య, ఇతర టీమ్ సభ్యులు కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళ వీడియోలు, ఫొటోలతో కూడిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరింది. 

రివేంజ్ ఒక్కటే కాదు... ప్రేమ కూడా!
'సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ' చూసిన తర్వాత... ముఖ్యంగా ఆ చివరి రెండు మూడు నిమిషాల సన్నివేశాలు చూస్తే, రెండో పార్టులో యాక్షన్ ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది. తన దుస్థితికి కారణమైన వ్యక్తులపై హీరో పగ తీర్చుకోవడం కన్ఫర్మ్ అర్థం అవుతుంది. ఆ రివేంజ్ ఒక్కటే కాదని... ఈసారీ స్వచ్ఛమైన ప్రేమ చూపించారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. 

Also Read : మంగళవారం సినిమా రివ్యూ: హత్యలు చేసింది ఎవరు - హీరోయినా? ఇంకొకరా?

'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'కి ఓ నెటిజన్ అయితే 4/5 రేటింగ్ ఇచ్చారు. మరొకరు రుక్మిణీ వసంత్ రూపంలో మంచి స్టార్ పెర్ఫార్మర్ దొరికారాని ప్రశంసల జల్లు కురిపించారు. 

రక్షిత్ శెట్టి మాస్... బీజీఎమ్ సూపర్!
కొన్ని సినిమాలు మన చేత వావ్ అనిపిస్తే... మరికొన్ని సినిమాలు కొన్ని తరాల పాటు మనతో పాటు ఉంటాయని, అటువంటి సినిమా 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరొకరు రక్షిత్ శెట్టి మాస్ పాత్రలో క్లాసీ డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. ఇదొక ఎమోషనల్ జర్నీ అని ఇంకొకరు ట్వీట్ చేశారు.    

Also Read : రెమ్యూనరేషన్ బదులు సినిమా రిలీజ్ - రిస్క్ చేస్తున్న నాని?

'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తీసుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు రీజనబుల్ అని చెప్పాలి. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో టికెట్ రేటు రూ. 200 మాత్రమే. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50 నుంచి రూ. 150 వరకు ఉన్నాయి. 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' చిత్రానికి హేమంత్ రావు దర్శకత్వం వహించారు. తొలి భాగంలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. ఇప్పుడీ సినిమాలో చైత్ర జె. ఆచార్ కూడా ఉన్నారు.

Published at : 17 Nov 2023 02:40 AM (IST) Tags: Telugu News Rakshit Shetty Rukmini Vasanth Sapta Sagaradaache Ello Side b Chaitra J Achar Sapta Sagaradaache Ello Side B Review SSE Side B Review Saptha Sagaralu Dhaati Side B Saptha Sagaralu Dhaati Side B Review

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

The Boys Season 4: ‘ది బాయ్స్’ వెబ్ సీరిస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సీజన్ 4 వచ్చేస్తోంది, ఇదిగో తెలుగు టీజర్

The Boys Season 4: ‘ది బాయ్స్’ వెబ్ సీరిస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సీజన్ 4 వచ్చేస్తోంది, ఇదిగో తెలుగు టీజర్

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!

Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!

రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’  - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
×