EMK New Promo: తారక్ షోకి గెస్ట్‌గా సమంత.. ‘ఇప్పుడు చెప్తే ఎలా.. ముందు చెప్పాలి కదా’ అంటూ ఆగ్రహం!
ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సమంత ప్రత్యేక అతిథిగా వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ఈ వారం అతిథిగా సమంత రానుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత ఒక షోకి రావడం ఇదే మొదటి సారి. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.
38 సెకన్ల పాటు ఉన్న ఈ ప్రోమోలో తారక్ ‘వెల్‌కమ్ సమంత’ అనగానే బృందావనంలో ‘యువకుల మనసైనా’ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో సమంత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ‘కూర్చుంటే భయంగా ఉంది’ అని సమంత అనగానే ‘ఉంటుంది.. ఇది హోస్ట్ సీట్, అది హాట్ సీట్’ అని ఎన్టీఆర్ అంటాడు.
‘మామూలుగా ఎవరైనా రూ.1,000 నుంచి కోటికి వెళ్తారు.. నువ్వు కోటి నుంచి రూ.1,000కి వస్తే బాగుంటుంది కదా’ అని ఎన్టీఆర్ సరదాగా అనగానే.. సమంత నవ్వుతూ ‘వద్దులే నాకు డబ్బు’ అంటుంది. వెంటనే తారక్ ‘వద్దా’ అని అడగ్గానే.. సర్దుకుని ‘కావాలి.. కావాలి’ అంటుంది.
ప్రోమో చివరిలో ‘క్విట్ అయిపోతావా’ అని ఎన్టీఆర్ అడిగినప్పుడు ‘ఇప్పుడు చెప్తే ఎలా.. మీరు నాకు ముందే చెప్పాలి కదా’ అంటూ సమంత సీరియస్ అవుతుంది. దీంతో ప్రోమోను ముగించారు
దసరా స్పెషల్‌గా ఈ గురువారం రాత్రి 8:30 గంటలకు ఎవరు మీలో కోటీశ్వరుడు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. సరదాగా సాగిన ఈ ప్రోమోను చూస్తే.. ఇందులో వ్యక్తిగత విషయాల ప్రస్తావన తక్కువగానే ఉన్నట్లు అనుకోవచ్చు.
ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రారంభ ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా రాగా.. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాల శివ ఒక ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చారు. ఇటీవలే మహేష్ బాబు గెస్ట్‌గా ఒక ఎపిసోడ్ షూటింగ్ కూడా అయింది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియరాలేదు.
గతంలో జరిగిన సీజన్ల కంటే ఈ సీజన్‌కు అద్భుతమైన రేటింగ్ వస్తుంది. బిగ్‌బాస్‌కు పోటీనిచ్చే విధంగా ఈ రేటింగ్స్ ఉన్నాయంటే.. ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. రెండో సీజన్‌కు కూడా తారక్‌నే హోస్ట్‌గా తీసుకుంటారని కూడా టాక్ మొదలైపోయింది.
I m d most happiest person on earth right now❤️Such an eye feast for mutuals like me...Their Friendship...The way they communicate to each other is goals damn🤎 @tarak9999 - @Samanthaprabhu2 #EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/ed3PONABfL
— Pramoda Paruchuri (@iampramoda) October 10, 2021
Also Read: ‘మా’ ఎన్నికల్లో తళుక్కుమన్న తారలు.. ఓటు వేసిన చిరు, పవన్, రామ్ చరణ్.. ప్రకాష్ రాజ్‌తో విష్ణు సెల్ఫీ
Also Read: దయచేసి మీరు వెళ్లిపోండి.. ఆమెకు టికెట్ డబ్బులు పంపిస్తా అని చెప్పా.. కానీ..
Also Read: అతనితో రకుల్ పెళ్లి? ఇన్ స్టా పోస్ట్ వైరల్
Also Read: బుల్లితెరపై బాలయ్య హంగామా.. టాక్‌షోపై ‘ఆహా’ క్లారిటీ.. ఇక పైసా వసూలే!