Jr NTR wife birthday: హ్యాపీ బర్త్ డే అమ్ములు - భార్యకు క్యూట్‌గా విషెష్ చెప్పిన ఎన్టీఆర్!
జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణీతకు క్యూట్ గా బర్త్ డే విషెష్ చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్ములు’ అంటూ ఓ బ్యూటీ ఫుల్ పిక్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భార్యతో కలిసి వెకేషన్ కు వెళ్తుంటారు. హ్యాపీగా జాలీగా గడుపుతుంటారు. చక్కటి పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. భార్య, కుటుంబం పట్ల తారక్ చూపిస్తున్న ప్రేమకు ఆయన అభిమానులు ఫిదా అవుతుంటారు.
భార్యకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్
ఇక తాజాగా తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, ‘హ్యాపీ బర్త్ డే అమ్ములు’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆయన భార్యకు విష్ చేసిన విధానంపై నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. భార్య అంటే తారక్ కు ఎంత ప్రేమో అంటూ కొనియాడుతున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ ముద్దుల భార్య లక్ష్మీ ప్రణతికి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 2011వ సంవత్సరం మే నెల 5న జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం ఘనంగా జరిగింది. ఈ క్యూట్ కపుల్స్ కు 2014లో అభయ్ రామ్ జన్మించారు. 2018 సంవత్సరంలో భార్గవ్ రామ్ పుట్టారు. ఇద్దరు అబ్బాయిలతో తారక్ దంపతులు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు.
View this post on Instagram
గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి
ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ కు మంచి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ మనువడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన, అచ్చం తాత మాదిరిగానే సినీ రంగంలో రాణిస్తున్నారు. చక్కటి నటన, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ అద్భుతంగా చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అందుకోవడంతో జూ. ఎన్టీఆర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది.
#NTR30 షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీ
‘RRR’ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. #NTR30 పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయబోయే దర్శకుడు, 'కెజియఫ్', 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా వచ్చారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థపై కొరటాల శివ మిత్రులు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సైతం మొదలయ్యింది.
Read Also: 39వ వసంతంలోకి రామ్ చరణ్, #RC15 సెట్స్ లో ఘనంగా బర్త్ డే వేడుకలు