News
News
X

MM Keeravani Remuneration: కీరవాణి షాకింగ్ రెమ్యునరేషన్.. అన్ని కోట్లు ఇస్తున్నారా..?

కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసిన కీరవాణి ఈ మధ్యకాలంలో కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే పని చేస్తున్నారు. 

FOLLOW US: 

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎం.ఎం.కీరవాణి ఒకరు. సినీ సంగీత చరిత్రలో ఆయనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. ఎలాంటి జోనర్ సినిమాకైనా దానికి తగ్గట్లు మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటారు. థ్రిల్లర్, యాక్షన్, ఆధ్యాత్మికం ఇలా సినిమా ఏ జోనర్ కి సంబంధించినదైనా.. కీరవాణి తన మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోస్తుంటారు. కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసిన కీరవాణి ఈ మధ్యకాలంలో కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే పని చేస్తున్నారు. 

మధ్యలో ఒకట్రెండు వేరే సినిమాలకు చేస్తున్నా.. ఎక్కువగా మాత్రం రాజమౌళి సినిమాలకే పని చేస్తున్నారు. డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ సినిమాలు చేయాలని కాకుండా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే రాజమౌళి సినిమాలకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి రాజమౌళి సినిమా అంటే దాదాపు ఆయన ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంటుంది. 

మ్యూజిక్ కోసం కీరవాణి, కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి, ప్రొడక్షన్-డైరెక్టర్ పనుల కోసం కార్తికేయను ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఫ్యామిలీ మొత్తం సినిమాలకు పని చేస్తుండడంతో రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ప్రతి సినిమా భారీ విజయం అందుకుంటుండడంతో ఆదాయం కూడా బాగానే వస్తోంది. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆయన ఫ్యామిలీ మొత్తం రికార్డు స్థాయిలో ఆదాయం అందుకుంటుందని సమాచారం. 

కీరవాణి ఒక్కరికే ఆయన వాటా కింద రూ.18 కోట్లు అందుతోందట. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పేరు సంపాదించుకున్న తమన్, దేవిశ్రీప్రసాద్ లాంటి వాళ్లు ఒక్కో సినిమాకి రూ.3 కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కోలీవుడ్ లో పేరున్న సంగీత దర్శకులకు ఐదు కోట్ల వరకు ఇస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అలాంటిది కీరవాణికి ఒక్క సినిమా కోసం రూ.18 కోట్లు ఇస్తున్నారంటే ఆయన క్రేజ్ ఏంటో తెలుస్తుంది. 

'బాహుబలి' సినిమా తరువాత కీరవాణి 'ఆర్ఆర్ఆర్' సినిమాకి పని చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా థీమ్ సాంగ్ విడుదలైంది. 'దోస్తీ' అంటూ సాగే ఈ  థీమ్ సాంగ్ కి ఇప్పుడు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ ప్రమోషనల్ సాంగ్ లో సింగర్స్ తో పాటు కీరవాణి కూడా కనిపించారు. ఒక్క పాటతోనే సినిమాలో మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో నిరూపించారు కీరవాణి. ఈ సినిమా నుండి ఒక్కో పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Published at : 04 Aug 2021 04:15 PM (IST) Tags: RRR ntr ram charan Rajamouli MM Keeravani keeravani Keeravani Remuneration

సంబంధిత కథనాలు

Gruhalakshmi August 12th Update: సామ్రాట్ కౌగిట్లో తులసి, అది చూసి తలబాదుకుంటున్న నందు, లాస్యకు ఊహించని షాక్

Gruhalakshmi August 12th Update: సామ్రాట్ కౌగిట్లో తులసి, అది చూసి తలబాదుకుంటున్న నందు, లాస్యకు ఊహించని షాక్

Guppedantha Manasu ఆగస్టు 12 ఎపిసోడ్: లగ్నపత్రిక రాయించే వేడుకలో రిషి సాక్షికి షాకివ్వబోతున్నాడా, వసు ఎందుకంత కూల్ గా ఉంది!

Guppedantha Manasu ఆగస్టు 12 ఎపిసోడ్: లగ్నపత్రిక రాయించే వేడుకలో రిషి సాక్షికి షాకివ్వబోతున్నాడా, వసు ఎందుకంత కూల్ గా ఉంది!

Devatha August 12th Update: నాన్నని తీసుకొస్తానని దేవికి మాట ఇచ్చిన ఆదిత్య- చంపేస్తానంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య

Devatha August 12th Update: నాన్నని తీసుకొస్తానని దేవికి మాట ఇచ్చిన ఆదిత్య- చంపేస్తానంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య

Ennenno Janmalabandham August 12th Update: ఖైలాష్ మీద కేసు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళిన వేద - కానీ అంతలోనే..

Ennenno Janmalabandham August 12th Update: ఖైలాష్ మీద కేసు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళిన వేద -  కానీ అంతలోనే..

Karthika Deepam Serial ఆగస్టు 12 ఎపిసోడ్: శౌర్య ప్రేమని గెలిపించేందుకు హిమ గుళ్లో ప్రేమ్ ని పెళ్లిచేసేసుకుంటుందా!

Karthika Deepam Serial ఆగస్టు 12 ఎపిసోడ్:  శౌర్య ప్రేమని గెలిపించేందుకు హిమ గుళ్లో ప్రేమ్ ని పెళ్లిచేసేసుకుంటుందా!

టాప్ స్టోరీస్

Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ

Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ

Breaking News Live Telugu Updates: జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం, మద్యం మత్తు వల్లే ప్రమాదం?

Breaking News Live Telugu Updates: జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం, మద్యం మత్తు వల్లే ప్రమాదం?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?