అన్వేషించండి

Ram charan - Anand Mahindra: ఆనంద్ మహీంద్రాను కలిసిన చెర్రీ - థాంక్యూ కేటీఆర్ అంటూ ట్వీట్!

ఫార్ములా ఈ రేసింగ్ కోసం వచ్చిన ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ కలిశాడు. ఫార్ములా రేసింగ్ గ్రాండ్ సక్సెస్ కావాలని ఆకాంక్షించాడు. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పాడు.

ఫార్ములా ఈ రేసింగ్ కు భాగ్యనగరం రెడీ అయ్యింది. రేపటి నుంచి హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ముల కార్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ రేసులో భారతీయ సంస్థ అయిన మహీంద్రా గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో మహింద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రాను, టెక్ మహీంద్రా సీఎండీ గుర్నానిని హీరో రాంచరణ్ కలిశాడు. దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ-ప్రిలో పాల్గొంటున్న మహీంద్రా గ్రూప్‌ నకు రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పాడు.

ఆనంద్ మహీంద్రాను కలవడం సంతోషంగా ఉంది- రామ్ చరణ్

భారత్ లో తొలిసారి జరుగుతున్న ఫార్ములా ఈ రేసింగ్‌కు హైదరాబాద్ మహానగరం తొలిసారి ఆతిథ్యం స్తోంది. ఫార్ములా-ఈ రేసింగ్‌ లో పాల్గొనే జనరేషన్-3 ఫార్ములా-ఈ రేస్ కారును తాజాగా మహీంద్రా గ్రూప్ ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్, హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. అటు  టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని, ఆటో అండ్ ఫాం సెక్టార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజిరూకర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రాతో రామ్ చరణ్ మాట్లాడారు. ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆటో దిగ్గజ అధినేతను కలవడం సంతోషంగా ఉందని రామ్ చరణ్ అన్నారు. ఈ రేసింగ్ మరింత సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరానికి ఇలాంటి గొప్ప రేసింగ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎంతో చొరవ చూపారని వెల్లడించారు. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.   

దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్న రామ్ చరణ్

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ‘RC 15’ పేరుతో వర్క్ నడుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమా చేసింది. రెండోసారి మళ్లీ జోడీ కడుతోంది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర జరుగుతోంది. ఇక్కడ సినిమాకు సంబంధించిన ఓ పాట షూట్ చేయనున్నారు. దర్శకుడు శంకర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.  

Read Also: బాబోయ్! షారుఖ్ వాచ్ ధర అన్ని కోట్లా? ఇంతకీ దాని ప్రత్యేక ఏంటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget