Ibomma: ‘ఐబొమ్మ’ పేరు మారిందట.. ఇకపై కొత్త సినిమాలన్నీ అందులోనే!
ఓటీటీలో సినిమాలు చూసే ప్రేక్షకులకు ‘ఐబొమ్మ’ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఏ ఓటీటీలో కొత్త సినిమా విడుదలైనా నిమిషాల్లో ఇందులో ప్రత్యక్షం అవుతుంది. తాజాగా ‘ఐబొమ్మ’ తన పేరును మార్చుకుంది.
Ibomma Name Changed: తెలుగు సినీ అభిమానుకు ‘ఐబొమ్మ’ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీలో సినిమాలు చూసే ప్రతి ఒక్కరికీ ‘ఐబొమ్మ’ సుపరిచితం. దేశంలోని ఏ భాషలో సినిమా ఓటీటీలో విడుదలైనా కొద్ది నిమిషాల్లోనే ‘ఐబొమ్మ’లో వచ్చేస్తుంది. ఈ సైట్ నుంచి ఈజీగా సినిమాను డౌన్ లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. అదీ పూర్తి ఉచితంగా. దీంతో ఈ వెబ్ సైట్ కు దేశ వ్యాప్తంగా మాంచి క్రేజ్ ఉంది. ఓటీటీలను కాదని, ‘ఐబొమ్మ’ను నమ్ముకుంటున్నారు చాలా మంది. ఈ వెబ్ సైట్ తాజాగా పేరు మార్చుకుంది. ఇంతకీ ఈ సైట్ కొత్తపేరు ఏంటంటే..
‘ఐబొమ్మ’ ఇప్పుడు ‘బప్పం టీవీ‘
‘ఐబొమ్మ‘ గత కొద్ది రోజులుగా కొత్త పేరుతో దర్శనం ఇస్తున్నది. సైట్ లోనూ కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ సైట్ మరింత అప్ డేట్ అయినట్లు అర్థం అవుతోంది. పనిలో పనిగా ‘ఐబొమ్మ‘ పేరును కూడా మార్చేశారు నిర్వాహకులు. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ పేరు ‘బప్పం టీవీ‘ (bappam.tv)గా మార్చారు. ఇప్పుడు ఐబొమ్మ అని సెర్చ్ చేయగానే, ‘బప్పం టీవీ‘ దర్శనం ఇస్తుంది. లింక్ ఓపెన్ చేయగానే.. అచ్చం ‘ఐబొమ్మ‘ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, లోగో సేమ్ డిజైన్ లో ఉన్నా, ‘బప్పంటీవీ‘గా కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా హోమ్, ఎబౌట్, బగ్ అనే కొత్త ఆప్షన్లను కూడా తీసుకొచ్చారు సైట్ నిర్వాహకులు. బప్పం అనేది పసుపు రంగులో ఉండగా, టీవీ అనేది తెలుపు రంగులో కనిపిస్తుంది. ఇన్ని రోజులు ‘ఐబొమ్మ’ ఓపెన్ చేయగానే, రజనీకాంత్ సినిమా మ్యూజిక్ వినిపించగా, ఇప్పుడు బీ ఫర్ బప్పం అని చిన్న పిల్లల వాయిస్ వివినిస్తోంది. ఈ వెబ్ సైట్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కలిపిస్తోంది ‘బప్పంటీవీ’.
థియేటర్ లో సినిమా చూడాలంటేనే భయపడుతున్న మధ్యతరగతి ప్రేక్షకులు
వాస్తవానికి గత కొంత కాలంగా సినిమా నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఈనేపథ్యంలో చాలామంది నిర్మాతలు ప్రభుత్వాలను ఒప్పించి టికెట్ రేట్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్తే, ఈజీగా రెండు, మూడు వేలు ఖర్చు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది థర్డ్ పార్టీ వెబ్ సైట్లలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి ఇప్పటి వరకు ‘ఐబొమ్మ’ ఓ వేదికగా మారింది. ఇప్పుడు ‘ఐబొమ్మ’ పేరు మార్చుకుని ‘బప్పం టీవీ’గా మారింది. అప్ డేట్ వెర్షన్ తో ప్రేక్షకులకు కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
Also Read: అబ్బబ్బా అనసూయ... ముద్దులు ఎక్కడ ఇస్తావ్ రీతూ... శ్రీముఖి మాటల్లో డబుల్ మీనింగ్!