అన్వేషించండి
Advertisement
Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?
ఓ క్యామియో రోల్ చేయడానికి అంగీకరించారు రవితేజ. చిరు సినిమాలో మన మాస్ మహారాజ్ కీలకపాత్రలో కనిపిస్తారట.
టాలీవుడ్ లో మాస్ మహారాజాగా గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. గతేడాది 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే 'ఖిలాడి' సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే 'రావణాసుర' అనే సినిమాను మొదలుపెట్టారు. వీటితో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' అనే సినిమా చేయబోతున్నారు.
ఇన్ని సినిమాలు తన చేతిలో ఉన్నప్పటికీ.. ఓ క్యామియో రోల్ చేయడానికి అంగీకరించారు రవితేజ. చిరు సినిమాలో మన మాస్ మహారాజ్ కీలకపాత్రలో కనిపిస్తారట. దర్శకుడు బాబీ ఈ సినిమాను రూపొందించబోతున్నారు. దీనికి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కథ ప్రకారం.. రవితేజను మాస్ అవతారంలో చూపించబోతున్నారట.
రవితేజ పుట్టినరోజు జనవరి 26న ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్-రవితేజ కాంబో అనేసరికి సినిమాలో సన్నివేశాలు ఊరమాస్ ఉంటాయని ఆశిస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా కోసం రవితేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. రవితేజ రోజుకి ఇంత అని రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.
రోజుకి పాతిక లక్షల చొప్పున ఇవ్వాలని నిర్మాతలను కోరగా.. వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎలా లేదన్నా రవితేజ పాత్రకి సంబంధించిన షూటింగ్ ఏడెనిమిది రోజులు ఉంటుందని అంటున్నారు. అలా చూసుకుంటే.. ఒక్క క్యామియో రోల్ కోసమే కోట్లలో ఛార్జ్ చేస్తున్నారన్నమాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నారు. అలానే 'భోళా శంకర్' సినిమా లైన్ లో ఉంది. త్వరలోనే బాబీ సినిమా షూటింగ్ మొదలుపెట్టి పూర్తి చేయాలనుకుంటున్నారు.
Also Read: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
Also Read: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..
Also Read: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..
Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion