అన్వేషించండి

Ratan Raajputh Casting Couch: ఆ కూల్ డ్రింక్‌లో ఏదో కలిపారు, ఆ గదిలో ఓ యువతి మత్తులో పడివుంది - క్యాస్టింగ్ కౌచ్‌పై నటి వ్యాఖ్యలు వైరల్

ప్రముఖ నటి రతన్ రాజ్‌పుత్ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచన వ్యాఖ్యలు చేసింది. తనకు కూడా భయంకరమైన పరిస్థితి ఎదురైనట్లు వెల్లడించింది. ఓ ఆడిషన్ కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను తాజాగా గుర్తు చేసింది.

గత కొద్ది సంవత్సరాలుగా బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. మీ టూ ఉద్యమం పేరుతో పలువురు సీనియర్ నటీమణుల నుంచి వర్థమాన హీరోయిన్లు వరకు చాలా మంది ఈ అంశంపై నోరు విప్పారు. ఆయా సందర్భాల్లో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. అవకాశాల కోసం వెళ్లిన తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి రతన్ రాజ్ పుత్ సైతం తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవం గురించి వివరించింది.. గతంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్లు వెల్లడించింది.

బలవంతంగా కూల్ డ్రింక్ తాగించారు!

“మీ టూ ఉద్యమం సమయంలో చాలా మంది తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవాల గురించి మాట్లాడారు. కానీ, నేను అప్పుడు మాట్లాడలేకపోయాను. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే, ఇకపై మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలను యువతరం నటీమణులు తెలుసుకోవాలి. సినిమా, టీవీ పరిశ్రమ మొత్తం చెడ్డది కాదు. కొంత మంది దుర్మార్గులు ఉన్నారు. వారి కారణంగానే ఇండస్ట్రీకి చెడు పేరు వస్తోంది. గతంలో నాకూ క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదురయ్యింది. ఓసారి ఆడిషన్ ఉందంటే ముంబై ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లాను. ఆడిషన్ కంప్లీట్ అయ్యింది. దర్శకుడికి మీ టాలెంట్ నచ్చింది. ఆయనతో సమావేశానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. దర్శకుడిని కలిసేందుకు పై ఫ్లోర్ కు వెళ్లాను. అక్కడ వద్దు అని చెప్పినా కూల్ డ్రింక్ తాగమని ఇచ్చారు. వద్దు అంటున్నా బలవంతం చేసి తాగించారు. ఆ డ్రింక్ నాకు కాస్త తేడాగా అనిపించింది. ఆ తర్వాత మరో ఆడిషన్ ఉంటుంది. మళ్లీ కాల్ చేస్తాం అని చెప్పగానే వెళ్లిపోయా” అని చెప్పుకొచ్చింది. 

భయం వేసి బయటపడ్డాం

“ఫస్ట్ ఆడిషన్ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాం. కొన్ని గంటల అనంతరం మళ్లీ కాల్ చేశారు. మరో ఆడిషన్ ఉంది ఫలానా చోటుకు రమ్మని చెప్పారు. మేం అక్కడికి వెళ్లాం. ఆ రూం చాలా భయంకరంగా ఉంది. ఆ గది అంతా వస్తువులు, దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. అమ్మడే ఓ అమ్మాయి స్పృహ లేకుండా పడిపోయి ఉంది. చూస్తుంటే మద్యం తాగినట్లుగా అనిపించింది. నా వెంట తీసుకెళ్లిన అబ్బాయిని చూసి బాయ్ ఫ్రెండ్ ను ఎందుకు తీసుకొచ్చావు అంటూ కోప్పడ్డారు. అతడు మా అన్నయ్య అని చెప్పాను. అక్కడి వాతావరణం ఎందుకో తేడాగా కనిపించడంతో అక్కడి నుంచి నెమ్మదిగా బయటపడ్డాం” అని రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. 'అగ్లే జనమ్ మోహే బితియా హై కిజో' సీరియల్ తో రతన్ రాజ్ పుత్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దానితో పాటు  ‘మహా భారత్’, ‘సంతోషి మా’ సీరియల్స్ తో మరింత పాపులర్ అయ్యింది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ratan Raajputh (@ratanraajputh)

Read Also: ‘OMG 2’లో స్వలింగ సంపర్కం సీన్స్‌ ఉన్నాయా? మూవీ టీమ్ సెన్సార్ బోర్డ్‌కు ఏం చెప్పింది? గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget