Rashmika On Vijay & Ranjithame : విజయ్ లాంటి కోస్టార్ ఉంటే కష్టం కాదంటోన్న రష్మిక
Ranjithame Lyrical Out Now : తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న 'వారిసు'లో ఫస్ట్ సాంగ్ ఈ రోజు రిలీజ్ చేశారు.
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) కథానాయకుడిగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా 'వారిసు' (Varisu). తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయిక. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. అయితే... సందడి మాత్రం ఇప్పటి నుంచి మొదలైంది. ఈ రోజు 'వారిసు'లో ఫస్ట్ సాంగ్ 'రంజిదమె' విడుదల చేశారు.
తమన్ మాస్ బీట్...
విజయ్ & రష్మిక స్టెప్స్!
'వారిసు' సినిమాకు ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ 'రంజిదమే'కు ఆయన మాంచి మాస్ అండ్ పెప్పీ ట్యూన్ అందించారు. తమిళంలో వివేక్ లిరిక్స్ రాశారు. రిలీజైన కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ అండ్ రష్మిక వేసిన స్టెప్స్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ పాటను విజయ్ పాడటం విశేషం. ఫిమేల్ లిరిక్స్ ఎంఎం మానసి పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
''సాంగ్ షూటింగ్స్ ఎప్పుడూ ఈజీగా ఉండవు. కానీ, ఇటువంటి పాట... విజయ్ లాంటి కో స్టార్... ఇటువంటి డ్యాన్సర్స్, టీమ్ ఉంటే... ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఇప్పుడీ పాట మీది'' అని రష్మిక పేర్కొన్నారు. ఈ పాటలో ఆమె లుక్ అభిమానులకు కిక్ ఇచ్చింది. మాస్ డ్యాన్స్ ఇరగదీశారని చెబుతున్నారు.
Also Read : విశ్వక్ సేన్‌తో ఎప్పటికీ సినిమా చేయను - తెర వెనుక ఏం జరిగిందో వివరించిన అర్జున్
View this post on Instagram
'వారసుడు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... విడుదలకు ముందే 'దిల్' రాజుకు 30 కోట్ల రూపాయలు లాభం వచ్చిందట! తమిళనాట విజయ్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయన సినిమాలు మినిమమ్ వంద కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అందుకని, 'వారసుడు' తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో రూ. 72 కోట్ల నుంచి రూ. 75 కోట్ల మధ్య సొంతం చేసుకుందట. ఓవర్సీస్ రిలీజ్ రైట్స్‌ను రూ. 38 కోట్లకు ఫార్స్ ఫిలిమ్స్ సొంతం చేసుకుందని సమాచారం. డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని... తెలుగు, తమిళ భాషల హక్కులను సుమారు 150 కోట్లకు అటు ఇటుగా అమ్మేశారని టాక్. ఆడియో రైట్స్ టీ సిరీస్ తీసుకుంది. ఐదు కోట్లకు ఆ డీల్ కుదిరిందని బాలీవుడ్ టాక్.
View this post on Instagram
తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో 'దిల్' రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.
View this post on Instagram
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు 'వారసుడు'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.