అన్వేషించండి

The Girlfriend Movie: రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్,’ అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో లేడీ ఓరియెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా చేయబోతోంది.

‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్న.. వరుస సినిమాలతో సౌత్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ రాణిస్తోంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో కలిసి ‘యానిమల్’ అనే సినిమా చేసింది. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో  సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప2’లో హీరోయిన్ గా చేస్తోంది. అటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘రెయిన్ బో’ సినిమాలోనూ నటిస్తోంది. అటు విక్కీ కౌషల్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పింది.  

రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ

వరుస సినిమాల్తో మంచి జోష్ మీదున్న రష్మిక మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పింది. యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’లో ఆమె ప్రధాన పాత్ర పోషించబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందబోతోంది. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రాహుల్ రవీంద్రన్, నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘చిలసౌ’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా నేషనల్ అవార్డు పొందింది. అదే ఉత్సాహంలో నాగార్జునతో కలిసి ‘మన్మథుడు 2’ సినిమా తెరకెక్కించారు.  అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. ఈ సినిమా దెబ్బకు రాహుల్ సైలెంట్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న ఆయన చాలా గ్యాప్ తర్వాత మరో మంచి కథతో దర్శకుడిగా నిరూపించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. చిన్న వీడియో గ్లింప్స్ రష్మిక తన  ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘ఖుషి’ సినిమాకి సంగీతం అందించిన అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ఒక అబ్బాయిని ఎంతగానో ప్రేమించే అమ్మాయి గురించి రాహుల్ చెప్పబోతున్నట్లు గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది.   

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  కాస్ట్యూమ్స్ డిజైనర్ గా శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైనర్ గా ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి వ్యవహరిస్తున్నారు.    

Read Also: సంక్రాంతి బరిలో మరో పెద్ద మూవీ, ‘తంగలాన్’తో రెడీ అంటున్న విక్రమ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget