అన్వేషించండి

Randeep Hooda: ఆ జైల్లో 20 నిమిషాలు ఉండలేకపోయా, బాలీవుడ్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’. పీరియాడియకల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Randeep Hooda About Veer Savarkar Biopic: సినీ తారలు ఆయా పాత్రల కోసం తమ బాడీని మలుచుకుంటారు. కొందరు బరువు పెరిగితే, మరికొందరు బరువు తగ్గుతారు. పాత్రకు తగినట్లుగా తమ శరీర సౌష్టవాన్ని మార్చుకుంటారు. తాజాగా ఇలాంటి ప్రయోగమే చేశారు బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. ఇంతకాలం హీరోగా కొనసాగిన ఆయన, ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ జీవిత కథ ఆధారంగా ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వీర్ సావర్కర్ జైలు గదిలో రణదీప్ హుడా

రణదీప్ హుడా తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. వీర్ సావర్కర్ చిత్రంలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు. వీర్ సావర్కర్ ను బంధించిన జైలు గదిలో ఆయన దిగిన ఫోటోలను షేర్ చేశారు. సెల్ లోపల సావర్కర్  ఫోటోను పెట్టారు. దాని పక్కనే నేల మీద మూలకు కూర్చుని కనిపించారు. “ఈ రోజు భరతమాత గొప్ప పుత్రులలో ఒకరి పుణ్యతిథి(వర్థంతి). ఆయన మరెవరో కాదు, నాయకుడు, నిర్భయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, తత్వవేత్త, దార్శనికుడు ‘స్వాతంత్ర్యవీర్‌ సావర్కర్’. అత్యున్నత  తెలివి తేటలు, ధైర్యసాహసాలు కలిగిన ఆయన బ్రిటీష్ గడగడలాడించారు.

ఈ చిన్న జైలు గదిలో పుష్కరకాలం పాటు బంధించారు. అతని బయోపిక్‌ తీస్తున్న సమయంలో, ఆయన ఎలాంటి బాధను అనుభవించారో తెలుసుకునేందుకు నేను ఈ సెల్‌ లో ఉన్నాను. ఆయన 11 సంవత్సరాల పాటు ఏకాంత నిర్బంధంలో ఉన్న చోట నేను 20 నిమిషాలు కూడా ఉండలేకపోయాను” అని చెప్పుకొచ్చారు. “జైలులో క్రూరమైన, అమానవీయ పరిస్థితులను భరించి, సాయుధ విప్లవాన్ని నిర్మించి, స్ఫూర్తిని కలిగించే వీర్‌ సావర్కర్  అసమానమైన సహనాన్ని నేను ఊహించాను. దేశ స్వాంత్ర్య సంగ్రామంలో దశాబ్దాల అతడి పట్టుదల, సహకారం సాటిలేనిది. అయినా కొన్ని శక్తులు ఇప్పటికీ అతనిని దూషిస్తూనే ఉన్నాయి” అని రణదీప్ హుడా ఆవేదన వ్యక్తం చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Randeep Hooda (@randeephooda)

4 నెలల్లో 26 కేజీల బరువు తగ్గిన రణదీప్

ఇక ఈ సినిమా కోసం రణదీప్‌ నాలుగు నెలల్లో ఏకంగా 26 కేజీల బరువు తగ్గినట్టు చిత్ర నిర్మాత ఆనంద్‌ పండిత్‌ ఇప్పటికే వెల్లడించారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా తనను తాను మార్చుకున్నట్లు చెప్పారు. సినిమా షూటింగ్‌ మొదలవడానికి ముందే ఆయన రెడీ అయినట్లు వెల్లడించారు. 86 కేజీలు ఉండే ఆయన ఈ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గినట్లు చెప్పారు.  బరువు తగ్గేందుకు రోజూ ఒక ఖర్జూర పండు, 1 గ్లాస్‌ పాలు మాత్రమే తీసుకున్నట్లు వివరించారు.  

Read Also: ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బీబీ హోటల్‌లో వైకుంఠపాళీ! టాలెంట్ చూపించిందెవరు? గెలిచిందెవరు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బీబీ హోటల్‌లో వైకుంఠపాళీ! టాలెంట్ చూపించిందెవరు? గెలిచిందెవరు?
Jabardasth Emmanuel: హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్... శ్రీ సత్యతో రొమాన్స్... లవ్ సాంగ్ 'ఇద్దరి గుండెలపైన' లిరిక్స్
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్... శ్రీ సత్యతో రొమాన్స్... లవ్ సాంగ్ 'ఇద్దరి గుండెలపైన' లిరిక్స్
Friday OTT Movies : శుక్రవారం ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ - ఓటీటీల్లో ఈ మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ - ఓటీటీల్లో ఈ మూవీస్ డోంట్ మిస్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget