By: ABP Desam | Updated at : 26 Feb 2022 05:00 PM (IST)
'రామారావు ఆన్ డ్యూటీ'లో రవితేజ
మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ (Sarath Mandava) తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు (RamaRao On Duty Movie Teaser on MARCH 1st) నేడు ప్రకటించారు.
తొలుత మార్చి 25న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఆ రోజు 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో వాయిదా వేయక తప్పలేదు. బహుశా... టీజర్‌తో పాటు విడుదల తేదీ వెల్లడిస్తారేమో! మార్చి 1న సినిమా విడుదల తేదీ (RamaRao On Duty Movie Latest Release Date) కూడా ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: రవితేజ మాటలకు అర్థాలు వేరులే! అసలు మేటర్ అదేనా!?
'రామారావు ఆన్ డ్యూటీ' యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని యూనిట్ చెబుతోంది. ఇందులో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రజిషా విజయన్ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా... సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read: సెట్స్‌కు రావణాసురుడు వచ్చాడోచ్... 'జాతి రత్నాలు' పిల్లతో...
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్
Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !