RGV - Ashu Reddy: అషు రెడ్డి కాళ్లను ముద్దాడిన రామ్ గోపాల్ వర్మ, ఫొటో వైరల్
రామ్ గోపాల్ వర్మ ఇటీవల 'డేంజరస్' మూవీ తీశారు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసింది అషు రెడ్డి.
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు గురించి పెద్ద గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాల్లో ఉంటుంటారు ఆర్జీవి. అదీ ఇదీ అని కాదు అన్నింటిలోనూ తాను ఉన్నానంటూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతారు. అలాగే మహిళల విషయంలోనూ బోల్డ్ గా మాట్లాడుతూ కొత్త కొత్త వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. తాజాగా ఆర్జీవి బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కాళ్ళు పట్టుకుని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు అషు రెడ్ది కాళ్ళను ముద్దాడారు కూడా. ఇందుకు సంబంధించిన ఫోటోలను అషు రెడ్డి తన సోష మీడియా ఖాతాలో షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
రామ్ గోపాల్ వర్మ ఇటీవల 'డేంజరస్' మూవీ తీశారు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసింది అషు రెడ్డి. ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవి నేలపై కూర్చొని ఉండగా.. ఎదురుగా అషు రెడ్డి సోఫా లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. దీంతో రామ్ గోపాల్ వర్మ.. అషు రెడ్డి కాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇదే అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. ఆర్జీవి ఏంటి.. అషు రెడ్డి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్స్.
రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ట్విస్ట్ లు ఇవ్వడం కొత్తేమి కాదు. అంతక ముందు కూడా అషు రెడ్డి తనను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆమె థైస్ గురించి బోల్డ్ గా కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా కెమెరా రకరకాలుగా ఫ్రేమ్ లు పెట్టి మరీ ఆ ఇంటర్వ్యూ ను కాంట్రావెర్సి చేశారు ఆర్జీవి. ఆ ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయితే ఈసారి ఇంటర్వ్యూ లో ఆర్జీవి డోస్ బాగా పెంచినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క ఇంటర్వ్యూ నే కాదు. గతంలోనూ ఇలాంటి ఇంటర్వ్యూ లు చాలానే చేశారు ఆర్జీవి. యాంకర్ అరియానాతో ఇంటర్వ్యూ లో పాల్గొంటూ ఆమె తో జిమ్ లో రకరకాల ఫీట్లు చేయించారు. ఆ ఇంటర్వ్యూ కూడా ఇలాగే వైరల్ అయింది.
ఇప్పుడు అషు రెడ్డి తో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మళ్ళీ కొత్త కాంట్రావెర్సి కు తెరలేపారు ఆర్జీవి. అషు రెడ్డి కూడా గతంలో ఆర్జీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్జీవి లైఫ్ స్టైల్ అంటే తనకు ఇష్టమని చెప్పింది. అందుకే ఆయనకు తాను ఎట్రాక్ట్ అయ్యానని పేర్కొంది. తాజా ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్ ‘‘ఆర్జీవి ఏంటయ్యా ఇదీ’’ అంటూ ట్రోల్స్ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం బోల్డ్ పబ్లిసిటీ చేసుకొని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? సుజిత్ పోస్టర్ డీకోడ్ చేస్తే..
View this post on Instagram