Ram - Boyapati Movie : రామ్ - బోయపాటి శ్రీను సినిమాలో విలన్‌గా యంగ్ హీరో
Hero Prince As Villain : బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ రోల్ చేసే ఛాన్స్ యంగ్ హీరోకి దక్కింది.
హీరోలకు విలన్ ఇమేజ్ ఇవ్వడంలో బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తర్వాతే ఎవరైనా! ఆయన మేకోవర్ మామూలుగా ఉండదు. 'లెజెండ్'తో ఫ్యామిలీ సినిమాల హీరోగా ముద్ర పడిన, మహిళలలో మంచి ఇమేజ్ ఉన్న జగపతి బాబును విలన్‌గా మార్చేశారు. 'అఖండ'లో శ్రీకాంత్ విలన్ రోల్ చేశారు. ఆయననూ ఎవరూ ఊహించని విధంగా చూపించడంతో పాటు, ఆయనలో విలనిజాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. ఇప్పుడు రామ్ హీరోగా చేస్తున్న సినిమాతో మరొక హీరోను విలన్ చేస్తున్నారు.
రామ్ సినిమాలో ప్రిన్స్ విలన్!
రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ పోతినేనితో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. అలాగే, 'అఖండ' వంటి భారీ విజయం తర్వాత బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే. హీరోగా రామ్ 20వ చిత్రమిది (RAPO20). ఇందులో విలన్ సెలక్షన్ రీసెంట్‌గా కంప్లీట్ అయ్యింది.
దర్శకుడు తేజ తీసిన 'నీకు నాకు డాష్ డాష్' సినిమాతో తెలుగు తెరకు ప్రిన్స్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా సరైన హిట్ రాలేదు. 'డీజే టిల్లు'లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. డ్రగ్ అడిక్ట్ కింద సైకోయిజం చూపించే పాత్ర చేశారు. ఇప్పుడు అతడిని బోయపాటి విలన్ చేశారు. రామ్ పోతినేనికి ధీటుగా సరికొత్త క్యారెక్టరైజేషన్, సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాతో ప్రిన్స్‌కు జగపతి బాబు, శ్రీకాంత్ తరహాలో కొత్త ఇమేజ్ రావడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు.
Also Read : తారక రత్నను కంటికి రెప్పలా కాపాడుతున్న బాలకృష్ణ - మృత్యుంజయ మంత్రంతో...
View this post on Instagram
రామ్ - బోయపాటి శ్రీను సినిమాకు ఎస్.ఎస్. తమన్ (S Thaman) ను సంగీతం అందించనున్నారు. 'అఖండ' చిత్రానికి ఆయన అందించిన నేపథ్య సంగీతం విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఆ విజయం తర్వాత మరోసారి తమన్, బోయపాటి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.
రామ్ జోడీగా శ్రీలీల
బోయపాటి శ్రీను సినిమాలో రామ్ పోతినేనికి జంటగా యంగ్ సెన్సేషన్, కొత్త హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 'పెళ్లి సందడి'తో తెలుగు తెరకు ఆమె కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత రవితేజ, పంజా వైష్ణవ్ తేజ్, మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు.
Also Read : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రామ్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయగా... మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. హిందీలో డబ్బింగ్ అయ్యాయి. ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆయన సినిమాలకు డిమాండ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో సినిమా అంటే కచ్చితంగా నార్త్‌లో డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. ఊర మాస్ కమర్షియల్ చిత్రాలు తీయడంలో, సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి చిత్రాలు తెరకెక్కించడంలో తన శైలి ఏంటనేది బోయపాటి శ్రీను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని టాక్.