By: ABP Desam | Updated at : 06 Apr 2023 01:31 PM (IST)
తలైవా రజినీ కాంత్(Image Credits: Rajinikanth, Lokesh Kanagaraj/Twitter)
Rajinikanth New Movie: వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్ తన నెక్ట్స్ ప్రాజెక్టును త్వరలోనే అనౌన్స్ చేస్తారని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. 'లియో' సినిమాతో బిజీ షెడ్యూల్ లో ఉన్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, త్వరలోనే రజినీ కాంత్ కు కథ చెప్పబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అనౌన్స్ మెంట్ ఎప్పుడో రావాల్సి ఉండగా.. తాజాగా వీరిద్గరూ త్వరలో మీట్ అవుతున్నారన్న వార్త సర్క్యులేట్ కావడంతో.. వీరి కాంబినేషన్ సెట్ పైకి వస్తుందని కోలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రజినీకాంత్- -లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 'జైలర్' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య రజినీ కాంత్ దర్శకత్వం వహించబోతున్న 'లాల్ సలామ్' షూటింగుల్లో పాల్గొననున్నారని సమాచారం. ఈ సినిమాలో సూపర్ స్టార్ ఓ అతిథి పాత్రను పోషించనున్నట్టు టాక్. అనంతరం ఈ ఏడాది చివర్లో రజినీకాంత్, డైరెక్టర్ జ్ఞానవేల్ తీయబోయే చిత్రంపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా టైటిల్ ను 'తలైవర్ 170'గా అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ షూటింగ్ మాత్రం 2024 రెండవ త్రైమాసికంలో ముగుస్తుందని మేకర్స్ తెలియజేశారు. కాగా ఈ మూవీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో బాగానే డిమాండ్ ఉంది. ఇప్పటికే కమల్ హాసన్, సూర్య, కార్తి, ఫాహాద్ ఫజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలను క్రైమ్ యాక్షన్ డ్రామ్ యూనివర్స్ లోకి తీసుకెళ్లిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. ప్రస్తుతం విజయ్ దళపతితో 'లియో' తెరకెక్కిస్తున్నారు. గడ్డ కట్టే చలిలో ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి కశ్మీర్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా తాము ఆ వాతావరణ పరిస్థితుల్లో ఎలా పనిచేశారో వివరిస్తూ.. సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ మరో భారీ హిట్ ను కొట్టబోతున్నారంటూ ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. . ప్రస్తుతం 'లియో' సినిమా షెడ్యూల్ బ్రేక్ లో ఉండగా, నెక్స్ట్ మంత్ చెన్నైలో 'లియో' కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనున్నట్టు సమాచారం. ఈ గ్యాప్ లోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమాను సెట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే ఆయన్ను కలిసి త్వరలోనే రజినీ కాంత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్నారని సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే గనక జరిగితే 'తలైవర్ 171'కు గ్రీన్ సిగ్నల్ పడ్డట్టేనని రజినీ ఫ్యాన్స్ అంటున్నారు.
లోకేష్ కనగరాజ్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నింటినీ పరిశీలిస్తే.. అతని స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. రజినీ కాంత్ తో ఆ కాంబినేషన్ సెట్ అయితే వీరిద్దరి ఇమేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూళ్లు చేయడం అంత కష్టమేం కాదని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బాబోయ్! ప్రేమ కోసం రాజశేఖర్‌ను జీవిత బ్రిడ్జి మీది నుంచి తోసేసిందా?
Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి
Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా
Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?
Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?
Punch Prasad: ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్‌కు ఏమైంది? రెండు కిడ్నీలు పాడవ్వడానికి కారణం అదేనా?
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్