Raj Kundra Worth : రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి ఆస్తుల వివరాలు!
శుక్రవారం సాయంత్రం ముంబైలో శిల్పా ఇంటికి చేరుకున్న పోలీసులు రాజ్ కుంద్రా వ్యాపారం గురించి ఆమెని ప్రశ్నించారు.
ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. విచారణలో భాగంగా పోలీసులు శిల్పాశెట్టిని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. శుక్రవారం సాయంత్రం ముంబైలో శిల్పా ఇంటికి చేరుకున్న పోలీసులు రాజ్ కుంద్రా వ్యాపారం గురించి ఆమెని ప్రశ్నించారు. అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో శిల్పాశెట్టికి ఏమైనా వాటా ఉందా అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాజ్ కుంద్రాకు కళ్లు చెదిరే ఆస్తులున్నాయి.
ఇవన్నీ కుంద్రా పోర్న్ ద్వారానే సంపాదించాడని ఎవరూ అనలేరు కానీ ఈ వివాదం నేపథ్యంలో వారికి ఉన్న కళ్లు చెదిరే సంపద అంతా చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ లో పాల్గొన్న తరువాత శిల్పాశెట్టి కెరీర్ మొత్తం మారిపోయింది. అప్పటికే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్న శిల్పా.. బిగ్ బ్రదర్ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. బాగా సంపాదిస్తోంది. ఇక రాజ్ కుంద్రా వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వీరిద్దరి ఆస్తులు కలుపుకుంటే వందల కోట్లలో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
ముంబాలో జుహూ ఏరియాలో రాజ్ కుంద్రా-శిల్పాశెట్టిలకు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. అక్కడే ఈ జంట జీవిస్తోంది. అక్కడ నుండి దిగిన పలు ఫ్యామిలీ ఫోటోలను శిల్పాశెట్టి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.
ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ గా పేరు పొందిన దుబాయ్ లో బూర్జ్ ఖలీఫాలో కూడా వీరిద్దరికీ ఓ అపార్ట్మెంట్ ఉండేది. రాజ్ కుంద్రా పెళ్లి సమయంలో శిల్పాశెట్టికి గిఫ్ట్ గా ఈ అపార్ట్మెంట్ ను ఇచ్చాడు. 19వ అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్ లో తమ కుటుంబం వెళ్లి స్టే చేయడానికి ఇరుకవుతుందని దాన్ని అమ్మేశారట.
ఇంగ్లాండ్ లో ఒక మ్యాన్షన్ ఉందట. సర్రే ప్రాంతంలో ఆ అందమైన మెన్షన్ ఉందని తెలుస్తోంది. రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి హాలిడే కోసం అక్కడకు ఫ్యామిలీతో పాటు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే వీరికో ప్రయివేట్ జెట్ కూడా ఉంది. ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయివేట్ జెట్ లో వెళ్తుంటారు. ఇక లగ్జరీ కార్లకు లోటే లేదు.
లాంబోర్గిని లాంటి కాస్ట్లీ కార్లను వాడుతుంటుంది శిల్పాశెట్టి. అలానే ఆమె దగ్గర ఒక బీఎండబ్ల్యూ జెడ్ 4 కారు కూడా ఉంది. ఇంకా వీరి ఎంగేజ్మెంట్ లో శిల్పాకు రాజ్ కుంద్రా పెట్టిన ఉంగరం ఖరీదు మూడు కోట్ల రూపాయలు. పెళ్లిలో శిల్ప ధరించిన లెహంగా రూ.50 లక్షలకు పైగానే ఉంటుంది. మొత్తానికి వీరిద్దరూ కలిసి లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు పోర్నోగ్రఫీ కేసు నుండి రాజ్ కుంద్రా ఎలా బయటపడతాడో చూడాలి!