Rahul Sipligunj Emotional: అంతర్జాతీయ వేదికపై గల్లీబాయ్ పేరు, హ్యాపీగా ఉందన్న రాహుల్ సిప్లిగంజ్
‘నాటు.. నాటు..’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడం పట్ల, సింగర్ రాహుల్ సింప్లిగంజ్ ఎమోషనల్ అయ్యారు. గల్లీ బాయ్ పేరు అంతర్జాతీయ వేదికపై వినిపించడం సంతోషంగా ఉందన్నారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికపై ‘RRR’ సినిమా సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’ అవార్డును అందుకుంది. ఆ పాటకు సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ‘RRR’ మూవీకి కీరవాణి సంగీతం అందించారు. ‘నాటు.. నాటు..’ పాటను చంద్రబోస్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— RRR Movie (@RRRMovie) January 11, 2023
pic.twitter.com/CGnzbRfEPk
కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్
‘నాటు.. నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సంతోషం వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తాను పాడిన ‘నాటు.. నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావాడం సంతోషంగా ఉందన్నారు. ఈ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని తాను ఊహించలేదన్నారు. తాను ఎప్పుడూ గల్లీ బాయ్ గానే భావించే వాడినని, కానీ, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి, తన పేరు చెప్పడం గర్వంగా ఉందన్నారు. మళ్లీ ఇలాంటి అద్భుతమైన సందర్భం వస్తుందో? రాదో? అన్నారు. ఈ సినిమాలో పాట పాడే అవకాశాన్ని కల్పించిన దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి సహా అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అటు ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల పాట రచయిత చంద్రబోస్ సైతం ఎమోషనల్ అయ్యారు.
Kotteshnammmm kaaaaakaaaaa…. 💥💥💥💥❤️🔥😍
— Rahul Sipligunj (@Rahulsipligunj) January 11, 2023
Thanks to my guru @mmkeeravaani garu 🙏🏻🙏🏻❤️ and the entire team of #RRRMovie for the @goldenglobes win
Congratulations to@ssrajamouli sir
@chandraboselyricist sir@alwaysramcharan sir@jrntr sir
ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR’
ఇక 2022 మార్చి 24న విడుదలైన ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా.. రూ.1200 కోట్ల కలెక్షన్‌స్ సాధించింది. స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ దక్కింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో పోషించిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్, ఆలియా భట్ అద్భుతంగా నటించి మెప్పించారు. జపాన్ లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. నిజానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అనేవి ఆస్కార్ కు పునాదిగా భావిస్తుంటారు. ఇక్కడ అవార్డులు అందుకున్న చాలా సినిమాలు ఆస్కార్ ను సైతం అందుకుంటాయి. ఈ నేపథ్యంలో ‘RRR’ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో అస్కార్ అవార్డ్స్ వేదికపైనా సత్తా చాటుతుందని అందరూ భావిస్తున్నారు. ఆస్కార్స్ లోనూ అవార్డును అందుకోవాలని సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబోస్