అన్వేషించండి

KBC 15: బతుకే దినదిన గండం- అయితేనేం, రూ. కోటి ప్రశ్నను చేరుకున్నరాహుల్!

కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్ లో రాహుల్ కుమార్ నేమా అసమాన ప్రతిభ కనబర్చాడు. అరుదైన బాధపడుతున్న ఆయన ఆట తీరుకు బిగ్ బీ సైతం ఆశ్చర్యపోయారు.

కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్ గతంతో పోల్చితే మరింత అద్భుతంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్లు  చక్కటి సమాధానాలతో పెద్ద మొత్తంలో నగదును గెలుచుకుంటున్నారు. జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్న కంటెస్టెంట్ రాహుల్ కుమార్ నేమా ఆట తీరుకు  ప్రేక్షకులతో పాటు అమితాబ్ సైతం ఆశ్చర్యపోయారు. వరుస ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, కోటి రూపాలయ ప్రశ్నకు చేరుకున్నారు. అతడి ఆట తీరును బిగ్ బీ ప్రశంసించారు.

కౌన్ బనేగా కరోడ్‌పతి 15 తాజా ఎపిసోడ్‌లో, రోల్‌ ఓవర్ పోటీదారు రాహుల్ కుమార్ నేమాతో గేమ్ ప్రారంభమవుతుంది. రూ. 6,40,000 ప్రశ్నతో ఆట షురూ అవుతుంది. మహాభారతాన్ని రాజు జనమేజయుడికి ఎవరు చెప్పారు? ఎ. మహర్షి వేద వ్యాస బి. ఋషి వైశంపాయన సి. నారద ముని డి. సంజయ అనే ఆప్షన్స్ ఇస్తారు. ఈ ప్రశ్నకు ప్రేక్షకుల పోల్‌ని ఉపయోగించి B అని సరైన సమాధానం చెప్తారు. ఆ తర్వాత రూ. 12,50,000 ప్రశ్న యునెస్కో 2023 నివేదిక  ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల్లో దేనిని నిషేధించాలని  సిఫార్సు చేసింది? ఎ. హోంవర్క్ బి. స్కూల్ బ్యాగులు సి. స్మార్ట్‌ ఫోన్లు డి. జంక్ ఫుడ్ అనే ఆప్షన్స్ ఇస్తారు. డబుల్ డిప్ తో సి అని సమాధానం చెప్పి ఆ అమౌంట్ ను గెలుస్తారు.  

నా కాళ్లపై నేను నిలబడాలనుకుంటున్నాను- రాహుల్

ఈ షో ద్వారా గెలుచుకున్న మొత్తాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? అని బిగ్ బీ రాహుల్ ను అడుగుతారు. “నేను ఎప్పుడూ నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఈ మొత్తంతో నేను రోబోటిక్ లెగ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నాను.  లేదంటే ఎవరైనా నాకు తగిన కృత్రిమ కాలును తయారు చేస్తారేమో ప్రయత్నిస్తాను. ఇది విజయవంతమైతే,  ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది” అన్నారు.  

రాహుల్ కు ఎదురైన రూ. కోటి ప్రశ్న ఏంటంటే?

ఆ తర్వాత రాహుల్ రూ. 50 లక్షల ప్రశ్నను ఎదుర్కొంటారు. 2003 FIFA ఉమెన్స్ వరల్డ్ కప్‌ను ఏ కారణం చేత  చైనా నుంచిUSAకి మార్చారు? A. 9/11 దాడులు, B. SARS C. స్వైన్ ఫ్లూ D. హాంకాంగ్ నిరసనలు. ఈ ప్రశ్నకు B అనే సరైన సమాధానం చెప్తాడు.  ఈ ప్రశ్న తర్వాత నేరుగా రూ. కోటి ప్రశ్నకు చేరుకుంటారు.  ఈ మాజీ ముఖ్యమంత్రులలో ఎవరు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు? A. శ్రీ జ్యోతి బసు B. శ్రీ బిజు పట్నాయక్ C. శ్రీ వీరప్ప మొయిలీ D. శ్రీ ఇఎంఎస్ నంబూద్రిపాద్. అతడు రిస్క్ తీసుకోలేక రూ. 50 లక్షలతో గేమ్‌ను విడిచిపెట్టాడు. అయితే, షో నుంచి బయటకు వచ్చే ముందుకు  సమాధానం ప్రయత్నించాలని బిగ్ బీ సూచిస్తారు. A అని తప్పు సమాధానం చెప్తాడు. కానీ, కరెక్టర్ ఆన్సర్ C.

రాహుల్ ఆరోగ్య సమస్య ఏంటంటే?  

రాహుల్ చిన్నప్పటి నుంచి జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. “నాకు ఆస్టియోజెనిసిస్ అసంపూర్ణంగా ఉంది. ఇది ఎముకలు సులభంగా విరిగియేలా చేస్తుంది. ఇది  20, 000 మందిలో ఒకరికి ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా నాకు దాదాపు 360 సార్లు ఎముకలు విరిగాయి. కాస్త గట్టి బరువు పడితే ఎముక విరిగిపోతుంది. నిద్రలో గట్టిగా ఒరిగిన ఒక్కోసారి ఎముక విరుగుతుంది.  ఎముకలు విరగడం, కట్లు వేసుకోవడం కామన్ అయ్యింది. అలవాటు పడిపోయాను” అని చెప్పారు.  

Read Also: రజనీ సినిమాలో బిగ్ బీ - 3 దశాబ్దాల తర్వాత మళ్లీ కలుస్తున్న లెజెండరీ యాక్టర్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
Telugu TV Movies Today: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, శ్రీ విష్ణు ‘శ్వాగ్’ TO చిరు ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, శ్రీ విష్ణు ‘శ్వాగ్’ TO చిరు ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSKKavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
Telugu TV Movies Today: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, శ్రీ విష్ణు ‘శ్వాగ్’ TO చిరు ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, శ్రీ విష్ణు ‘శ్వాగ్’ TO చిరు ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
Vijay Deverakonda: కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
Balochistan War: పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
IPL 2025 KKR VS PBKS Match Abandoned: పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ ర‌ద్దు.. ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్, ప్ర‌భ్ సిమ్రాన్, ప్రియాంశ్ మెరుపులు వృథా
పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ ర‌ద్దు.. ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్, ప్ర‌భ్ సిమ్రాన్, ప్రియాంశ్ మెరుపులు వృథా
Embed widget