అన్వేషించండి

Raghu Thatha Movie: ‘రఘు తాత‘ అప్పుడే విడుదలా? కీర్తి సురేష్ మూవీ నుంచి షాకింగ్ అప్ డేట్!

Raghu Thatha Movie: ఓ వైపు ‘సలార్’ మూవీతో ఫుల్ బిజీగా ఉన్న హోంబలే ఫిల్మ్స్, మరోవైపు ‘రఘు తాత‘ సినిమా గురించి కీలక అప్ డేట్ ఇచ్చింది. త్వరలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపింది.

Raghu Thatha Movie: హొంబలే ఫిల్మ్స్ సంస్థ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’ విడుదలకు రెడీ అవుతోంది. ప్రశాంత్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి ఈ సినిమా హడావిడి దేశవ్యాప్తంగా మొదలయ్యింది. పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా, ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

‘రఘు తాత’ రిలీజ్ గురించి కీలక ప్రకటన

హొంబలే ఫిల్మ్స్ సంస్థ ‘సలార్’ క్రేజ్ ను తన బ్యానర్ లో నిర్మిస్తున్న ఇతర సినిమాకు సైతం వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు చేస్తోంది. రీసెంట్ గా ‘భగీర’ టీజర్ ను విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ, తాజాగా మరో మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్న ‘రఘు తాత’కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుందంటూ ప్రకటన చేసింది. ఈ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 90వ దశకంలో మాదిరిగా రిక్షా మీద సినిమా రిలీజ్ అనౌన్స్ చేస్తున్నట్లు గ్లింప్స్ లో చూపించారు.

‘సలార్’ క్రేజ్ ను వాడుకుంటున్న హొంబలే ఫిల్మ్స్

వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ‘రఘు తాత’ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన షూటింగ్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఎలాంటి విషయాలు వెల్లడించకుండానే సడెన్‌గా ఈ సినిమా విడుదల కాబోతుందని ప్రకటించింది. రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయాన్ని వెల్లడించకుండా, త్వరలో రిలీజ్ అవుతుందని తెలిపింది. ‘సలార్’ హడావిడిలో ఈ సినిమా ప్రకటన ఎందుకు చేశారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అయితే, ‘సలార్’ మూవీ క్రేజ్‌ను సంస్థ వాడుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.    

తమిళంలోకి అడుగు పెట్టిన హొంబలే ఫిల్మ్స్

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బాగా అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం 'కెజియఫ్', 'కెజియఫ్ 2', 'కాంతార' చిత్రాలతో జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులలో తమకంటూ గుర్తింపు, గౌరవం సొంతం చేసుకున్న హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించడం. ఈ సినిమాతోనే తమిళ చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతోంది. నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న తొలి తమిళ సినిమా 'రఘు తాత'. సుమన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మహిళల హక్కుల కోసం పోరాడే పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో దేవదర్శిని, MS భాస్కర్, రవీంద్ర విజయ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సీన్ రోల్డన్ సంగీతం అందిస్తున్నారు. యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, టిఎస్ సురేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి ‘రివాల్వర్ రీటా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అటు వరుణ్ ధావన్ తో కలిసి ‘VD18’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది.

Read Also: ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం, డైరెక్టర్ వెంకటేష్ మహా ట్విట్టర్ ఖాతా డియాక్టివేట్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget