ఆత్మహత్య చేసుకున్న పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్
పూరి జగన్నాథ్ సహాయ దర్శకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే అందుకు కారణం అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని సమాచారం.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో సహాయ దర్శకుడు ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దుర్గం చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో మృతుడిది రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం కొత్తగూడ అని తేలింది. మృతదేహం సాయి కుమార్‌దిగా గుర్తించారు. ఆర్థిక సమస్యల కారణంగా... అప్పుల బాధలు, ఇబ్బందులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పూరి జగన్నాథ్ దగ్గర పని చేసిన సాయి కుమార్
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దగ్గర గతంలో సాయి కుమార్ (Sai Kumar) సహాయ దర్శకుడిగా పని చేసినట్లు తెలిసింది. అక్కడ మానేసి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. ఉద్యోగం ఇంకా రాలేదని, ఈ లోపు అప్పులు బాధ ఎక్కువ అయ్యిందని తెలుస్తోంది. సాయి కుమార్ మరణం మరోసారి చలన చిత్ర పరిశ్రమలో కింద స్థాయి వ్యక్తుల పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు తెలిసింది.
Also Read : డబుల్ మీనింగ్ జోక్ వేసిన రెజీనా - ఆమె దగ్గర అవే ఉన్నాయా?
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లైగర్' ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైంది. అంచనాలు అందుకోవడం ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. అప్పటి నుంచి పూరి జగన్నాథ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఆయన కంటే ఎక్కువగా ఛార్మీ కౌర్ మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు కారణమా? మరొకటా? అనేది తెలియదు గానీ... సోషల్ మీడియాకు ఆమె బ్రేక్ ఇచ్చారు.
రూమర్స్... రూమర్స్!
Puri Jagannadh New Movie : 'లైగర్' ఫ్లాప్ తర్వాత ముంబైలో అద్దెకు ఉన్న ఫ్లాట్ కు రెంట్ కట్టలేక పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ హైదరాబాద్ కు వచ్చారనే గాసిప్స్ హల్ చల్ చేశాయి. 'లైగర్' సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ లో ఇద్దరూ ఉంటున్నారని... దాని రెంట్ నెలకు రూ. 10 లక్షలు అని వార్తలు వచ్చాయి. 'లైగర్' ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండతో ప్రారంభించిన 'జన గణ మణ' కూడా ఆగిందని వార్తలు వచ్చాయి. పూరి తర్వాత ప్రాజెక్టు, ఆర్థిక పరిస్థితులు, లైగర్ సెటిల్మెంట్స్ సహా పలు విషయాల గురించి చాలా వార్తలు వచ్చాయి. ఇవన్నీ చిరాకు కలిగించడంతో ట్విట్టర్ వేదిగా ఛార్మీ వివరణ ఇచ్చారు. ప్రచారం అవుతున్న రూమర్స్ అన్ని ఫేక్ అని కొట్టిపారేశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ డెవలప్మెంట్ పై పని చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
Also Read : 'బ్రహ్మాస్త్ర' ఫ్లాప్ - ఐనాక్స్, పీవీఆర్‌కు 800 కోట్లు లాస్