Pulsar Bike Jhansi: ఓవర్ నైట్ స్టార్ కాలేదు, 18 ఏండ్ల కష్టం ఉంది, బాధలను చెప్తూ కంటతడి పెట్టిన ఝాన్సీ
‘పల్సర్ బైక్‘ పాట ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యింది ఝాన్సీ. ప్రస్తుతం బుల్లితెరపై డ్యాన్సర్ గా రాణిస్తోంది. తాజాగా తన కష్టాల గురించి, అవమానాల గురించి చెప్తూ కంటతడి పెట్టింది.
ఒక వ్యక్తి సక్సెస్ సాధించారంటే, దాని వెనుక ఎన్నో ఏండ్ల శ్రమ ఉంటుంది. దాన్ని మనం గమనించలేం. కేవలం సక్సెస్ రాగానే ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయారు అని మాత్రమే చెప్తాం. అలాంటి వారిలో ఒకరు కండక్టర్ ఝాన్సీ. కండక్టర్ ఝాన్సీ అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, పల్సర్ బైక్ ఝాన్సీ అంటే మాత్రం ఈజీగా గుర్తు పడతారు. ఒకే ఒక్క పాటతో ఆమె ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇరు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఈమె తన జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. మరెన్నో అవమానాలకు గురయ్యింది. అసభ్య వేధింపులకు లోనయ్యింది. వాటన్నింటినీ ఎదుర్కొని పల్సర్ బైక్ సాంగ్ తో బాగా పాపులర్ అయ్యింది.
పల్సర్ బైక్ సాంగ్ తో పాపులర్ అయిన ఝాన్సీ
గాజువాకలో కండక్టర్ గా విధులు నిర్వహించిన ఝాన్సీ, ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకే ఒక్క పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. బస్ కండక్టర్ గా విధులు నిర్వహించే ఝాన్సీ, వీలుప్పుడల్లా తన డ్యాన్స్ తో అందరినీ అలరించేది. ఎన్నో పాటలకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. పల్సర్ బైక్ అనే పాట ఆమె కెరీర్ కు ఓ టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది. ఈ పాటతో ఎంతో మంది అభిమానులను సంపాధించుకోవడంతో పాటు పలు టీవీ షోలలో డ్యాన్సర్ గా పాల్గొనే అవకాశాలు దక్కించుకుంది. ఆమె డ్యాన్స్ చేసిన పల్సర్ బైక్ పాటను రవితేజ మూవీ ‘ధమాకా’లోనూ పెట్టారంటే ఆ సాంగ్ ఎంత బాగా పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
టైలర్ తప్పుగా ప్రవర్తించాడు, నాన్నకు చెప్దామంటే?
నిజానికి, పల్సర్ బైక్ పాట ద్వారా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది అనుకునే వారికి తాజా ఝాన్సీ ఓ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. తన కష్టం వెనుక 18 ఏండ్ల కష్టం ఉందని చెప్పుకొచ్చింది. ఓ చానెల్లో ప్రసారం అయ్యే ‘సూపర్ క్వీన్ సీజన్-2’ షోలో పాల్గొన్న ఝాన్సీ, తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకుని ఎమోనల్ అయ్యింది. ఎన్నో ఇబ్బందులు, అవమానాలకు గురైనట్లు వివరించింది. ఓ టైలర్ దగ్గరికి వెళ్లే, కొలతలు తీసుకునే సమయంలో తప్పుగా ప్రవర్తించినట్లు చెప్పింది. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పి తనకు బుద్ది చెప్పించాలనుకుంటే, అదే తండ్రి వచ్చి నేను నీ తండ్రిని కాదని చెప్పు అని చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఏప్రిల్ 9న ఈ షో ప్రసారం కానుంది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ షోకు గెస్ట్ గా వచ్చారు.
View this post on Instagram
Read Also: రావణాసుర To శాకుంతలం, ఏప్రిల్ లో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!