Sunitha Tati - Sudheer Varma : దర్శకుడు సుధీర్ వర్మతో గొడవా? - వివరణ ఇచ్చిన నిర్మాత
'శాకిని డాకిని' చిత్ర నిర్మాత సునీత తాటి, దర్శకుడు సుధీర్ వర్మ మధ్య గొడవలు వచ్చాయనేది ఇండస్ట్రీ టాక్. అందుకని, మరొకరితో షూటింగ్ కంప్లీట్ చేశారని ఆ వార్తల సారాంశం. వీటిపై నిర్మాత వివరణ ఇచ్చారు.
రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'శాకిని డాకిని' (Shakini Dakini Movie). సెప్టెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ హీరోయిన్లు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ట్రైలర్, థీమ్ సాంగ్, మరో సాంగ్ రిలీజ్ అయ్యాయి. అయితే... చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ సోషల్ మీడియాలో ఎక్కడా ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు. కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు. దీనికి కారణం నిర్మాత సునీతతో గొడవలు అని ఇండస్ట్రీ టాక్. 'శాకిని డాకిని' ప్రెస్‌మీట్‌లో ఆ ప్రచారంపై నిర్మాత స్పందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
అసలు ఇండస్ట్రీ టాక్ ఏంటి?
కొరియన్ సినిమా 'మిడ్‌నైట్ రన్నర్స్'కు 'శాకిని డాకిని' రీమేక్. ఒరిజినల్ సినిమాలో కొన్ని మార్పులు చేద్దామని సుధీర్ వర్మ (Sudheer Varma) సూచిస్తే... ఉన్నది ఉన్నట్టుగా తీయాలని నిర్మాత పట్టుబట్టారట. అలా తీసిన తర్వాత సినిమా బాలేదని, కొన్ని మార్పులు చేయమని నిర్మాత సూచిస్తే... సుధీర్ వర్మ చేయలేదని, అప్పుడు మరొక దర్శకుడితో సినిమా కంప్లీట్ చేశారని ఫిల్మ్ నగర్ గుసగుస.
నిర్మాత సునీత ఏమంటున్నారు?
సినిమాలో చిన్న పార్ట్ మరొకరు షూటింగ్ చేసిన మాట వాస్తవమని నిర్మాత సునీత తాటి (Sunitha Tati) క్లారిటీ ఇచ్చారు. అయితే... సుధీర్ వర్మతో తమకు ఎటువంటి గొడవలు లేవని చెప్పారు. కరోనాకు ముందు సినిమా స్టార్ట్ చేయడంతో ఆలస్యం అయ్యిందని, ఈ లోపు సుధీర్ వర్మకు మరో పెద్ద సినిమా (Ravi Teja Ravanasura Movie) రావడంతో ఆయన్ను సపోర్ట్ చేస్తూ... ప్యాచ్ వర్క్ ఇంకొకరితో షూటింగ్ చేశామన్నారు.
''జనవరి 2020లో 'శాకిని డాకిని' సినిమాను సుధీర్ వర్మ మొదలు పెట్టారు. మధ్యలో కొవిడ్ 19 మహమ్మారి వల్ల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయన పెద్ద సినిమా చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ఆయన్ను రమ్మని అడగడం కరెక్ట్ కాదు. ఆయన్ను సపోర్ట్ చేయాలి. అందుకని, ఆయన సూచించిన వ్యక్తితో షూటింగ్ కంప్లీట్ చేశాం. ఆయన అప్రూవ్ చేసిన తర్వాత మరొకరు షూట్ చేసిన సీన్స్ ఓకే చేశాం'' అని సునీత తెలిపారు. 'శాకిని డాకిని' కోసం సుధీర్ వర్మ కమిట్మెంట్‌తో వర్క్ చేశారని ఆవిడ వివరించారు.
వినోదంతో పాటు మంచి సందేశం ఉంది : రెజీనా
'శాకిని డాకిని' సినిమాలో యాక్షన్, కామెడీతో పాటు మంచి వినోదం ఉందని రెజీనా కాసాండ్రా తెలిపారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశామన్నారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ ''ఈ సినిమాలో 'కదిలే కదిలే' పాట వింటే నాకు గూస్ బంప్స్ నాకు తెలిసి... చాలా మంది జిమ్ సాంగ్ అవుతుంది. నాకు ముందు నుంచి యాక్షన్ చేయడం అంటే ఇష్టం. ఈ సినిమాతో యాక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. దాని కోసం ముందుగా ప్రిపేర్ అవ్వడం, వర్క్ షాప్స్ చేయడం కొత్తగా అనిపించింది'' అని చెప్పారు.
Also Read : కొరియన్‌లో 'ఆర్ఆర్ఆర్' రీమేక్ - ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసిన సునీత తాటి
రెజీనాతో కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వస్తోంది : నివేదా థామస్
'శాకిని డాకిని' ప్రచార చిత్రాల్లో రెజీనాతో తన కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ లభిస్తోందని నివేదా థామస్ తెలిపారు. కథ విన్నప్పుడు, కథా చర్చల్లో పాల్గొన్నప్పుడు సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు కలిగిందని ఆవిడ అన్నారు. ఇంకా నివేదా థామస్ మాట్లాడుతూ ''తెలుగులో చేస్తున్నామని తెలిశాక 'మిడ్ నైట్ రన్నర్స్' చూశా. నేను శాలిని రోల్ చేశా. నిజ జీవితంలో కూడా నా పాత్ర అలాగే ఉంటుంది. పెద్దగా కష్టపడటం అవసరం లేదనిపించింది. తెలంగాణ యాస నేర్చుకుని చేశా. యాక్షన్ సీన్స్ చేయడం ఛాలెంజ్. వాటి కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాం. యాక్షన్ నేపథ్యంలో ఇటువంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉంది'' అని అన్నారు.
Also Read : 'కెప్టెన్' టు 'బ్రహ్మాస్త్ర' - థియేటర్లలో విడుదలయ్యే ఎనిమిది సినిమాల్లో మీ ఓటు దేనికి?