Prabhas-Pawan: బస్తీ సెట్‌లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ - ఫిల్మ్ సిటీలో మన హీరోలు!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్ పక్కపక్కనే జరుగుతోందట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్'(Salaar). ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.
కొత్త షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో పడింది చిత్రబృందం. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన బస్తీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంకొన్ని రోజులపాటు ఇక్కడే షూటింగ్ నిర్వహించనున్నారు. పక్కా ప్లానింగ్ తో టీమ్ ముందుకెళ్తోంది.
సెప్టెంబర్ 28, 2023లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నారు. రీసెంట్ గా అతడికి సంబంధించిన లుక్ ను కూడా రిలీజ్ చేశారు.
ఇదిలా ఉండగా.. 'సలార్' షూటింగ్ జరుపుకుంటున్న పక్కనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కూడా జరుగుతోందట. ప్రస్తుతం పవన్.. 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. గుర్రాలతో పాటు సాగే ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారట. దీనిలో భాగంగా సెట్ లో రోజు అధిక సంఖ్యలో గుర్రాలు.. యూనిట్ సభ్యులు కనిపిస్తున్నారు.
సినిమాలో ఈ గుర్రపు సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సన్నివేశాలను క్రిష్ తనదైన క్రియేటివిటీతో ఎలివేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ షూటింగ్, మరోపక్క ప్రభాస్ షూటింగ్ లతో ఫిల్మ్ సిటీ కళకళలాడిపోతోంది.
Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్
View this post on Instagram