Prabhas As Police : 'అర్జున్ రెడ్డి' స్టైల్‌లో ప్రభాస్ పోలీస్ సినిమానా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' రూపొందనుంది. ఆ సినిమా గురించి నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడారు.
రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ఇప్పటి వరకు పోలీస్ రోల్ చేయలేదు. 'సాహో'లో అండర్ కవర్ కాప్ కింద కాసేపు కనబడతారు. అయితే, చివరకు అది నిజం కాదని తెలుస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఆయన పోలీస్‌గా కనిపించనున్నారు. ఆ సినిమా ఒక రేంజ్‌లో ఉంటుందని నిర్మాత భూషణ్ కుమార్ చెబుతున్నారు.
'అర్జున్ రెడ్డి' స్టైల్‌లో ప్రభాస్ సినిమా
'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో, ఆ సినిమా హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'తో ఉత్తరాది ప్రేక్షకులలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనకంటూ స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. 'స్పిరిట్'కు ఆయనే దర్శకుడు. అందులోనే ప్రభాస్ పోలీస్ రోల్ చేస్తున్నది.
'స్పిరిట్' సినిమాను టీ సిరీస్ పతాకంపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు.
''స్పిరిట్' చాలా యూనిక్ సినిమా. ఇదొక కాప్ డ్రామా. ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు స్పెషల్ స్టైల్ తీసుకు వచ్చారు. మ్యూజిక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి చూసి ఉండరు'' అని భూషణ్ కుమార్ పేర్కొన్నారు. 'స్పిరిట్' కంటే ముందు 'యానిమల్' విడుదల కానుందని కాబట్టి ప్రభాస్ సినిమా గురించి ఎక్కువ చెప్పడం మాట్లాడటం లేదని ఆయన తెలిపారు.
'యానిమల్'కు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. అందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఆల్రెడీ ఆయన లుక్ విడుదల చేశారు. ముఖం అంతా రక్తంతో రణ్‌బీర్ లుక్ జనాలను అట్ట్రాక్ చేసింది. అందులో అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఆయనది తండ్రి క్యారెక్టర్. తండ్రీ కొడుకుల కథతో సినిమా రూపొందుతోంది.
ప్రభాస్ లిస్టులో చాలా ఉన్నాయ్
Prabhas Upcoming Movies : ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి. 'ఆదిపురుష్' చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఆ సినిమాను తొలుత ఈ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నా... వీఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసం వాయిదా వేశారు. మరో మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' చేస్తున్నారు ప్రభాస్. అది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్. అది రెండు భాగాలుగా విడుదల కానుంది. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా సెట్స్ మీద ఉంది. అది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఒకటి చేస్తున్నారు. ఈ మూడు కంప్లీట్ అయ్యాక... మరో రెండు సినిమాలు లైనులో ఉన్నాయి.
'స్పిరిట్' కాకుండా మరొకటి
'స్పిరిట్' కాకుండా మరో సినిమా కూడా ప్రభాస్ అంగీకరించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేయనుంది. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్ 2'కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి వచ్చారు. వాళ్ళను ప్రభాస్ సినిమా గురించి బాలకృష్ణ అడగ్గా... కన్ఫర్మ్ చేశారు.
Also Read : పవన్ కొలతలు కావాలి, బాలకృష్ణ మాట విన్నారా? - 'అన్‌స్టాపబుల్ 2' వీడియో గ్లింప్స్ వచ్చేసిందండోయ్
''ప్రభాస్ గారు, హిందీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నాం. సల్మాన్ ఖాన్ హీరోగా కూడా ఒక సినిమా ప్లానింగులో ఉంది'' అని నవీన్ యెర్నేని తెలిపారు.