Poonam Kaur: పూనమ్ కౌర్ ట్వీట్‌పై రగులుతోన్న సెగ - పవన్ ఫ్యాన్స్‌కు కోపం ఎందుకు?
నటి పూనమ్ కౌర్ ఇటీవల సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాలపై ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే చేసిందంటూ పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Poonam Kaur: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య కాలంలో పూనమ్ కౌర్ కు తెలుగులో అంతగా సినిమా అవకాశాలు ఏమీ రావడం లేదు. సినిమా అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోది పూనమ్. ఒక్కోసారి పూనమ్ చేసే పోస్ట్ లు, వ్యాఖ్యలు రాజకీయంగా కూడా దుమారం రేపుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలు గతంలోనే చాలానే ఉన్నాయి. తాజాగా పూనమ్ కౌర్ ఏపీ పాలిటిక్స్ టార్గెట్ గా ఓ సంచలన ట్వీట్ చేసింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
అలాంటి నాయకుల్ని నమ్మొద్దు: పూనమ్ కౌర్
నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు రాజకీయాలపై కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తుంది. ఒక్కోసారి అవి వివాదాలకు కూడా దారితీస్తాయి. తాజాగా పూనమ్ అలాంటి ట్వీట్ నే షేర్ చేసింది. ఏపీ రాజకీయాలను ఉటంకిస్తూ ఆమె ఆ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆమె టార్గెట్ చేసినట్టు ట్వీట్ చూస్తే అర్థమవుతోంది.
పూనమ్ ట్వీట్ లో ఇలా రాసుకొచ్చింది.. "ఆంధ్రప్రదేశ్ లో కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. మహిళలకు సంరక్షణ పట్ల వారికి అంత ఆందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి మద్దతుగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండండి, వాళ్లను నమ్మొద్దు’’ అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.
To feel respected and secured is woman’s first priority , love is overrated and exaggerated. 🙏❤️✌️🧘♀️ pic.twitter.com/0mi1is6mQe
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 9, 2023
ఈ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది. ఈ ట్వీట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూనే చేశారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ పూనమ్ కౌర్ ను హెచ్చరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పూనమ్ చేసిన వ్యాఖ్యలు ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన పూనమ్..
పూనమ్ కౌర్ ట్వీట్ పై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పూనమ్ కు వ్యతిరేకంగా ట్వీట్ లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే పూనమ్ కూడా తనను ట్రోల్ చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ను ఇచ్చింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో స్టేటస్ పెట్టింది. ‘‘నా మీద బ్యాడ్ కామెంట్లు పెడుతున్నవారు ఒకటి గుర్తు పెట్టుకోండి. నా పేరు ‘కౌర్’. దాదాపు ఐదేళ్లు అవుతుంది. ఒకసారి ఆలోచించుకోండి’’ అంటూ రాసుకొచ్చింది. మరి ఈ వివాదం ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
Also Read: ఆంధ్రోడా, అంటూ చిల్లర కామెంట్స్ చేశారు - ఆ వివాదంపై స్పందించిన నటుడు బ్రహ్మాజీ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial