By: Ram Manohar | Updated at : 22 Sep 2022 02:27 PM (IST)
ఐశ్వర్యా రాయ్ లుక్స్‌కి ఫిదా అవుతున్న అభిమానులు. (Image Credits:Twitter)
Aishwarya Rai Bachchan:
నందిని క్యారెక్టర్‌కు కరెక్ట్ ఛాయిస్: ఫ్యాన్స్
అందాల తార ఐశ్వర్యా రాయ్..బచ్చన్ పొన్నియన్ సెల్వన్‌తో త్వరోలనే వెండితెరపై మెరవనున్నారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంటర్వ్యూలతో టీం అంతా చాలా బిజీగా ఉంటోంది. రోజుకో అప్‌డేట్‌తో ముందు కొస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. చోళుల కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది. అయితే...ఈ మూవీలో అందరి స్క్రీన్ అప్పియరెన్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఐశ్వర్వారాయ్ లుక్స్ అందరినీ కట్టిపడేశాయి. నందిని పాత్రలో ఐష్...చాలా హుందాగా, అందంగా ఉన్నారు. సినిమా టీజర్ ట్రైలర్ విడుదల చేయకముందే... అందరి క్యారెక్టర్‌లను పరిచయం చేస్తూ ఒక్కొక్కరి లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. అప్పటి నుంచి ఐష్ లుక్ అందరికీ నచ్చేసింది. ఇప్పుడు కొత్తగా మరో స్టిల్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆమె ఫ్యాన్స్ అయితే..ట్విటర్‌లో పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ ఫోటోలో ఐశ్వర్యారాయ్ లూస్ హెయిర్‌తో, నగలు పెట్టుకుని ఉన్నారు. ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నందిని పాత్రకు ఐశ్వర్యా రాయ్ కరెక్ట్ ఛాయిస్ అని దర్శకుడు మణిరత్నంని ప్రశంసిస్తున్నారు.
A "FULL MOON" with Fire 🔥 Those eyes speaks alot. ❤️ 😍 #AishwaryaRaiBachchan #PonniyinSelvan pic.twitter.com/39DGpO91a6
— Aishwarya rai fan (@Pradeep06867868) September 21, 2022
#PonniyinSelvan #PS1 Behind the scenes stills
— @ponniyinselvan_movie (@PS_FANS_CLUB) September 21, 2022
This scene is from Lathamandapam chapter where #Nandini handles 3 men next to next ( Vanthiyathevan , Periya Pazhuvetrayar , Ravidasan ) with her smile #AishwaryaRaiBachchan nailed it like icing on cake , her expressions 💥🔥 pic.twitter.com/xAgZPCwg0V
The perfect choice 🔥 thanks #ManiRatnam 🙏♥️
— Nandini (@LiveLonly1) September 21, 2022
Nandini Devi is coming on 30 sep 2022#AishwaryaRai#AishwaryaRaiBachchan #PonniyinSelvan #ps1 pic.twitter.com/BnnU7bTXtF
మణిరత్నంతో స్పెషల్ బాండింగ్..
ఐశ్వర్యకు, డైరెక్టర్ మణిరత్నంకి ఓ స్పెషల్ బాండింగ్ ఉంది. 2007లో వచ్చిన మణిరత్నం గురు మూవీ సహా, 2010లో వచ్చిన రావణ్‌లోనూ ఐశ్వర్య నటించారు. అసలు ఐశ్వర్య మొదటి సారి వెండితెరకు పరిచయం అయిందే..మణిరత్నం "ఇద్దరు" సినిమాతో. ఈ అన్ని సినిమాల్లోనూ ఐశ్వర్యారాయ్‌ని చాలా అందంగా చూపించారు మణిరత్నం. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్‌లోనూ అంత కన్నా అందంగా చూపించనున్నట్టు ఈ స్టిల్స్ చూస్తేనే అర్థమవుతోంది.
Also Read: Nene Vasthunna: ‘పొన్నియన్ సెల్వన్’తో ధనుష్ పోటీ, ‘నేనే వస్తున్నా’ అంటూ ఇలా షాకిచ్చాడు!
ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన
Guppedanta Manasu March 22nd: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Gruhalakshmi March 22nd: రాజ్యలక్ష్మి మెడలు వంచుతున్న దివ్య- లాస్యకి నందు విడాకులు..!
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది