By: ABP Desam | Updated at : 17 Dec 2022 11:12 AM (IST)
'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఎన్ని సినిమాలు రూపొందుతున్నాయి? ఇప్పుడు ఆయన ఓకే చేయడంతో అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సినిమాలు ఎన్ని? అంటే... మూడు! అందులో ఒకటి సెట్స్ మీద ఉంది. మరొక సినిమాకు రీసెంట్‌గా పూజ చేశారు. ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు కాకుండా మరో సినిమా బృందానికి జనవరి నుంచి షూటింగ్ ప్లాన్ చేసుకోమని చెప్పారట.
మేనల్లుడి సినిమాకూ పవన్ 'ఎస్'
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్'కు లాస్ట్ సండే పూజ చేశారు. దానికి కొన్ని రోజుల ముందు 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందబోయే సినిమా వెనక్కి వెళ్ళిందని భావించారంతా! అయితే, ఆ సినిమాకు కొత్త ఏడాదిలో పవన్ డేట్స్ కేటాయించారని తెలిసింది.
జనవరి నుంచి 'వినోదయ సీతం' రీమేక్
సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా... పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో తమిళంలో విజయవంతమైన 'వినోదయ సీతం'ను రీమేక్ చేయాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంకల్పించింది. ఒరిజినల్‌కు డైరెక్షన్ చేసిన సముద్రఖని, తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నారు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందట.
పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లెంగ్త్ సినిమాలో ఎక్కువ ఉండదు. ఆయన 20 రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుంది. సో... జనవరి, ఫిబ్రవరిలో పది పది రోజుల చొప్పున కేటాయించినా సరిపోతుంది.
కొత్త ఏడాదిలో రెండు రిలీజులు కన్ఫర్మ్
'హరి హర వీర మల్లు' సినిమా 2023లో విడుదల కావడం కన్ఫర్మ్. దాంతో పాటు 'వినోదయ సీతం' రీమేక్ కూడా విడుదల అవుతుంది. మరి, మూడో సినిమా విడుదల అవుతుందా? లేదా? అనేది చూడాలి. హరీష్ శంకర్ స్పీడుగా షూటింగ్ చేస్తారు. ఆల్రెడీ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో సెట్స్ మీదకు వెళ్ళడం ఆలస్యం... వెళితే వచ్చే ఏడాది విడుదల కావడం ఖాయం.
Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి?
స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో దశరధ్
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' గుర్తు ఉందిగా!? కింగ్ అక్కినేని నాగార్జున 'సంతోషం' సినిమా!? ఆ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన దశరథ్ ఉన్నారుగా! ఇప్పుడు ఆయన 'ఉస్తాద్ భగత్ సింగ్'కు వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాను తీయబోయే తాజా సినిమా స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో దశరథ్ వర్క్ చేస్తున్నారని హరీష్ శంకర్ చెప్పారు. అదీ విషయం! ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు.
హీరో గ్యాంగ్‌స్టర్ కా బాప్...
పవన్ కళ్యాణ్‌ను దర్శకుడు సుజీత్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నారు. సినిమాలో హీరోది డాన్ రోల్. 'They Call Him #OG' అని పోస్టర్ మీద ఒక కాప్షన్ ఇచ్చారు కదా! అందులో OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అన్నమాట. 'హీరో (పవన్ కళ్యాణ్)ను అందరూ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటారు' అనేది మీనింగ్. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ నీడను గన్ రూపంలో డిజైన్ చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ ఆ విధంగా రివీల్ చేశారు.
Also Read : మినీ సిరీస్ రివ్యూ : నెట్‌ఫ్లిక్స్‌లో బెంగళూరు కామపిశాచి ఉమేష్ రెడ్డి డాక్యుమెంటరీ
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...
VBVK Trailer : విడుదలకు ముందు లాభాల్లో 'వినరో'
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన