By: ABP Desam | Updated at : 02 Feb 2023 11:07 PM (IST)
అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వివాదంపై స్పందించారు. (Image Credits: Aha Video)
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే రెండో సీజన్ చివరి ఎపిసోడ్‌కు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇందులో ఎంతో వివాదాస్పదం అయిన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. పవన్‌తో మాట్లాడుతూ... ‘అసలు ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అని బాలకృష్ణ అడిగారు.
ఆ ప్రశ్నకు పవన్ బదులిస్తూ... ‘నేను అస్సలు పెళ్లి చేసుకోవాలనుకోలేదు జీవితంలో. బ్రహ్మచారిగా ఉండిపోవాలి. యోగమార్గంలో కలిసిపోవాలి అనుకున్నా. అక్కడ నుంచి నా జీవిత ప్రయాణం చూస్తే నాకే ఇలా జరిగిందా అనిపిస్తుంది. నేను చాలా సంప్రదాయంగా బతికే వ్యక్తిని.’
‘మొదటి సంబంధం ఇంట్లో వాళ్లు చూశారు. రిలేషన్ షిప్‌లో కొన్ని కుదరలేదు కాబట్టి వాళ్లు విడిపోయారు (తమ గురించే). రెండో సారి చేసుకున్నప్పుడు కూడా అభిప్రాయ భేదాల్లాంటివి వచ్చాయి. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం రాలేదు. అవి వేరే పరిస్థితులు.’
‘అందరూ మూడు పెళ్లిళ్లు అంటుంటే, ముగ్గుర్ని ఒకేసారి చేసుకోలేదురా బాబూ. ముగ్గురితో ఒకేసారి ఉండలేదు. ఒక వ్యక్తికో కుదరలేదు. రెండో సారి చేసుకున్నాను. వాళ్లతో కూడా కుదరలేదు. ఇంకోసారి చేసుకున్నాను. నేను కోరికతోనో, వ్యామోహంతోనో చేసుకోలేదు. అలా జరిగాయి అంతే.’
‘రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శించడానికి అది ఒక ఆయుధం అయింది. నేను కూడా అవి పెద్దగా పట్టించుకోను. లోపల నాకు ఆ విషయంలో గిల్టీ ఫీలింగ్ లేదు. నేను చాలా మంది అధికారులను చూశాను. నన్ను విమర్శించే నాయకుల వ్యక్తిగత జీవితాలు చూశాను. నాకంటే ఇంట్రస్టింగ్‌గా ఉంటది వాళ్ల పర్సనల్ లైఫ్. కానీ నా సంస్కారం మాట్లాడనివ్వదు.’
‘ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించాలంటే నాకు వాళ్ల ఇంట్లో ఆడపడుచులు గుర్తొస్తారు. నా సంస్కారం మాట్లాడనివ్వకుండా ఆపేస్తుంది. వాళ్లకా సంస్కారం లేదు కాబట్టి దాని గురించి పదేపదే మాట్లాడతారు. వాళ్లని ఎలాగో మనం ఆపలేం. ఇది రాజకీయ వేదిక అయితే నా భాష వేరుగా ఉండేది. కానీ పెద్దలు బాలకృష్ణ ఎదురుగా ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను.’
‘నేను ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదమ్మా. కుదరక అలా అయింది. నేను విడాకులు ఇచ్చాకనే ఇంకో వివాహం చేసుకున్నాను. ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకుని, ముగ్గురిని ఒకే ఇంట్లో పెట్టి అలా చేయలేదు. ఒకరి మీద నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. కానీ నాకు సంస్కారం, సభ్యత ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే గొడవల కారణంగానే అలా అయింది. అంతకు మించి ఇంకేం ఉంటది.’ అని సమాధానం ఇచ్చారు.
దానికి బాలకృష్ణ ‘ఇంకోసారి ఆయన గురించి, పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మాటల మధ్యలోనే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గురించి చెప్పారు. ‘మీరు (బాలకృష్ణ) చాలా ముక్కుసూటి వ్యక్తి. లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడరు. మంచో, చెడో బయటకు ఏదో ఒకటి అనేస్తారు. ఆయన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. ప్రేమ అయినా ఒకేలా ఉంటది. గొడవ పెట్టుకున్నా ఓపెన్‌గానే ఉంటుంది. ఆయన మనసులో నుంచి మాట్లాడతారు.’ అన్నారు.
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక
డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత
'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది
మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
Modi Flexis on Flyover: హైదరాబాద్ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు