అన్వేషించండి

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - ఓజీ టీమ్ ఏమంటోందంటే?

Pawan Kalyan OG Update : పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా టీమ్ ఇవాళ ఓ అప్డేట్ ఇచ్చింది. అది పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసేలా ఉందని చెప్పాలి.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏపీలో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు వస్తుండటంతో ఆయన చూపు అటు ఉంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి కొన్ని రోజుల టైం ఇచ్చారు. దాంతో ఆయన సినిమా షూటింగులకు తాత్కాలికంగా విరామం ఇవ్వక తప్పలేదు. ఆ విషయాన్ని 'ఓజీ' టీం చెప్పింది. ఒక విధంగా పవన్ అభిమానులకు అది నిరాశ కలిగించే అంశమే. అసలు వివరాల్లోకి వెళితే... 

ఇప్పుడు షూటింగ్ చేయడం లేదు!
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (OG Movie). 'దే కాల్ హిమ్ ఓజీ' అనేది ఫుల్ టైటిల్. ఓజీ అంటే 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అని మీనింగ్. బాంబే మాఫియాను ఎదిరించి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కథతో రూపొందుతున్న చిత్రమిది. ఆల్రెడీ 80 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు టాక్. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 

''పుట్టినరోజు శుభాకాంక్షలతో మా టైమ్ లైన్ అంతా నిండిపోయింది. అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఆకలి మీద ఉన్నారు. ఇందుమూలంగా మీకు తెలియజేసేది ఏమంటే... ప్రస్తుతం మేం షూటింగ్ చేయడం లేదు. అందువల్ల, అప్డేట్స్ ఇవ్వడం కోసం మరింత టైం పడుతుంది. వెండితెర మీద తమ అభిమాన దేవుడిని చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ రోజులు వెయిట్ చేయక తప్పదు'' అని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. సో... షూటింగ్ పూర్తి చేశాక విడుదల తేదీ గురించి చెబుతారన్నమాట. ఆల్రెడీ విడుదలైన టీజర్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. 

Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య 'ఓజీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో నిర్మించారు. 'సాహో' తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే.

Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

'ఓజీ'లో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. 'బుట్ట బొమ్మ'తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన తమిళ నటుడు, 'ఖైదీ' & 'విక్రమ్' ఫేమ్ అర్జున్ దాస్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ ఉన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : ఏఎస్ ప్రకాష్, ఛాయాగ్రహణం : రవి కె చంద్రన్, సంగీతం : ఎస్. థమన్, నిర్మాత : డీవీవీ దానయ్య, రచన - దర్శకత్వం : సుజీత్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Embed widget