Pathaan Box Office: బాలీవుడ్, ఊపిరి పీల్చుకో ‘పఠాన్’ వచ్చాడు - ‘బాహుబలి’, ‘2.0’ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు
బాక్సాఫీస్ దగ్గర ‘పఠాన్‘ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. ‘2.0‘, ‘బాహుబలి‘ సినిమాల కలెక్షన్లను మించిపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా రికార్డుకెక్కింది.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కిన తాజాగా సినిమా ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. షారుఖ్ ఖాన్ రియర్‌లోనే అత్యధిక గ్రాసర్ గా గుర్తింపు పొందింది. దీపికా పదుకొనె హీరోయిన్‌గా, జాన్ అబ్రహాం విలన్ గా నటించిన ఈ మూవీ ఇప్పటికే రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులోకి అడుగు పెట్టింది. ‘2.0’, ‘బాహుబలి’ సినిమాల రికార్డులను తుడిచిపెట్టింది.
బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ
విడుదలకు ముందే ‘పఠాన్’ రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా రూ. 250 కోట్లు సంపాదించింది. ఆదివారం వరకు 12 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న’పఠాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.429.90 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.832 కోట్ల గ్రాస్‌తో కలెక్షన్లలో సరికొత్త రికార్డును సాధించింది. ‘పఠాన్’ ఆల్ టైమ్ (అన్ని భాషలతో కలిపి) అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో టాప్ 5లోకి అడుగు పెట్టింది. శంకర్- రజనీకాంత్ కాంబోలో వచ్చిన ‘2.0’ చిత్రం రూ.408 కోట్లు (రూ.800 కోట్ల గ్రాస్) వసూళ్లతో 5వ స్థానంలో ఉంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ రూ.418 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా రూ. 429 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నాలుగో స్థానం
ఓవర్సీస్ లోనూ 'పఠాన్' భారీగా వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు 40 మిలియన్ డాలర్లకు పైగానే రాబట్టి సంచలనం సృష్టించింది. అంటే.. భారత కరెన్సీలో దాదాపుగా ఈ సినిమా రూ.330 కోట్లు వరకూ గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. 'పఠాన్' 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.437 కోట్ల వరకూ నెట్ రాబట్టింది. అందులో హిందీలోనే రూ. 420 కోట్ల వరకూ వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో 'కేజీఎఫ్ 2' రూ. 434 కోట్లు నెట్‌కు చేరువగా వచ్చింది. అటు అత్యంత వేగంగా రూ. 850 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రాల్లో ‘బాహుబలి 2’, ‘RRR’, ‘KGF2’ తర్వాత ప్లేస్ లో పఠాన్’ నిలిచింది.
View this post on Instagram
'పఠాన్' సినిమా విడుదలకు ముందు షారుఖ్ ఖాన్ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. 'పఠాన్' టైటిల్ నుంచి షారుఖ్ లుక్, సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాటలో దీపికా పదుకోన్ ధరించిన బికినీ రంగు, సోషల్ మీడియాలో బాయ్ కాట్ పఠాన్ ట్రెండ్స్... ఒక్కటి కాదు, బోలెడన్ని సమస్యలు ఫేస్ చేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ విడుదలైన 'పఠాన్' తొలి రోజు నుంచి షారూఖ్ ఖాన్ రేంజ్ ఏంటో ప్రపంచానికి చెబుతోంది. సౌత్ సినిమాల దాటికి కుదైలన బాలీవుడ్‌ను ఊపిరి పీల్చుకోమని భరోసా ఇస్తోంది.
Read Also: మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ - ఈ వార్తలు నిజమేనా?