News
News
వీడియోలు ఆటలు
X

Parineeti Chopra: ఆప్ లీడర్‌తో పెళ్లిపై ఎట్టకేలకు స్పందించిన పరిణీతి చోప్రా

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. యువ రాజకీయ నాయకుడితో మూడు ముళ్లు వేయించుకోబోతోంది. తాజగా ఈ విషయం గురించి పరిణీతి స్పందించింది.

FOLLOW US: 
Share:

ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై వారు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. తాజా వీరికి సంబంధించిన కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. త్వరలో వీరిద్దరు మూడు ముళ్లు వేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎంపీ సంజీవ్ ఆరోరా ధృవీకరించారు. రాఘవ్, పరిణీతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “నేను రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ప్రేమ, ఆనందం, సాంగత్యంతో కలిసి మెలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మరోసారి వారికి నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.   

పెళ్లి గురించి పరిణితి చోప్రా ఏమందంటే?

తాజాగా మీడియాతో పరిణీతి చోప్రా ఇంటరాక్ట్ అయ్యింది. ఢిల్లీ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్స్ గురించి మాట్లాడింది. తన పర్సనల్ లైఫ్ గురించి ఏవైనా అనుమానాలు, అపోహలు ఉంటే క్లారిఫై చేస్తానని చెప్పుకొచ్చింది. కానీ, రాఘవ్ చద్దాతో రిలేషన్ షిప్ గురించి పెదవి విప్పలేదు. త్వరలో ఢిల్లీలో వీరి నిశ్చితార్థం జరగబోతోందన్న వార్తలపైనా తను ఎలాంటి కామెంట్ చేయలేదు. అటు రాఘవ్ కూడా పెళ్లి గురించి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. భవిష్యత్తులో మాట్లాడుకునే సందర్భాలు చాలా వస్తాయని చెప్పారు. పరిణీతి గురించి కాకుండా రాజ్‌నీతి గురించి తనను అడగాలని కోరారు.   

నిశ్చితార్థ పనుల్లో పరిణీతి, రాఘవ్ కుటుంబాలు బిజీ బిజీ   

పరిణీతి చోప్రా,   రాఘవ్ చద్దా నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. "ఇంకా అధికారికంగా వివాహ వేడుక గురించి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇద్దరి కుటుంబాలు ఈ విషయం గురించి చర్చించుకుంటున్నాయి. త్వరలో కొన్ని వేడుకలు జరగనున్నాయి. వీరిద్దరు ఒక్కటి కాబోతున్నందుకు ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ప్రస్తుతం పరిణీత, రాఘవ్ బిజీగా ఉన్న నేపథ్యంలో, కొద్ది రోజుల్లో వారి వివాహ వేడుక గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారు” అని ఇరుకుటంబ సభ్యుల సన్నిహితులు వెల్లడిస్తున్నారు.  ప్రియాంక చోప్రా,  నిక్ జోనాస్ కూడా వీరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.  

కలిసి చదువుకున్న పరిణీతి, రాఘవ్ చద్దా

ఇక  పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ లో కలిసి చదువుకున్నారు. వారికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.  

View this post on Instagram
 
A post shared by Raghav Chadha (@raghavchadha88)

View this post on Instagram
 
A post shared by @parineetichopra

Read Also: 'ఆదిపురుష్'కి అరుదైన గౌరవం - ఇప్పుడైనా దర్శకుడిపై ట్రోల్స్ ఆగుతాయా? 

Published at : 19 Apr 2023 12:23 PM (IST) Tags: Raghav chadha Parineeti Chopra Wedding Rumours Parineeti Chopra Personal life

సంబంధిత కథనాలు

Bhola Shankar: చిరు లీక్స్ - ‘భోళా శంకర్’ సాంగ్ షూట్‌లో మెగాస్టార్ నవ్వుల సందడి, ఫ్యాన్స్ ఫిదా!

Bhola Shankar: చిరు లీక్స్ - ‘భోళా శంకర్’ సాంగ్ షూట్‌లో మెగాస్టార్ నవ్వుల సందడి, ఫ్యాన్స్ ఫిదా!

Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి

Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

టాప్ స్టోరీస్

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్