అన్వేషించండి

Parineeti Chopra: నటి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్? వెడ్డింగ్ డేట్ కూడా ఫిక్స్ - ప్రియాంక వచ్చేది అప్పుడేనట

గత కొన్ని రోజులుగా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ప్రేమ విషయం అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వారి నిశ్చితార్థం కూడా అప్పుడే అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Priyanka Chopra : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల ప్రేమ పెళ్లికి అంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంతే కాదు వీరి పెళ్లి అక్టోబర్ నెలలో జరగనుందంటూ ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వీరి వివాహానికి ప్రముఖ నటి ప్రియాంక చోప్రా హాజరుకానున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

గత కొన్ని రోజులుగా పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా లవ్ టాపిక్ పై చాలా వార్తలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. మొదట్లో వీరిద్దరూ స్నేహితులనే భావించినా.. పలుమార్లు జంటగా కనిపించడంతో చాలా మంది వీరు డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం చేశారు. కానీ ఆ విషయంపై వారిద్దరూ ఏ ఒక్కరూ స్పందించలేదు. ఎలాంటి కామెంట్సూ చేయలేదు. ఆ తర్వాత ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా ఈ జంట కెమెరాలకు చిక్కారు. దీంతో అందరూ అనుకుంటుందే నిజమంటూ మరిన్ని రూమర్స్ వచ్చాయి. ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్లు పరిణీతి చోప్రాను ఈ విషయంపై ప్రశ్నించగా.. ఆమె సిగ్గుపడుతూ వెళ్లిపోయారు. ఆమె అలా సమాధానం దాటవేయడంతో చద్దాతో ఆమె బంధంపై వస్తోన్న ఊహాగానాలు నిజమేనని మీడియా కథనాలు ప్రచురించడం మొదలు పెట్టింది.

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పలు మార్లు ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్టుల్లో జంటగా కనిపించడంతో ఫ్యాన్స్ కూడా వీరిద్దరూ లవ్ లో ఉన్నారని ఫిక్స్ అయ్యారు. ఇప్పటివరకు ఈ విషయంపై బాలీవుడ్ లో జోరుగా చర్చ సాగుతుండగా.. ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్టులో పరిణితి చేతికి ఉంగరం కనిపించడంతో దీనికి మరింత బలం చేకూరింది. ఇప్పటికైనా ఈ జంట స్పందిస్తారా? లేదా? అనే అతృతతో నెటిజన్లు ఎదురుచూశారు. కానీ అప్పుడూ ఈ జంట పెదవి విప్పలేదు.

ఇక తాజాగా వీరిద్దరి పెళ్లిపై వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందంటూ ప్రచారం సాగుతోంది. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఆల్రెడీ అయిపోయినట్టు వారి సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరులో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో కొత్త అప్ డేట్ ఏంటంటే ఈ సెలబ్రెటీ స్టార్ వెడ్డింగ్ కు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కూడా హాజరు కానున్నట్టు సమాచారం. దాంతో పాటు జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఇక ఇప్పుడైనా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాలు స్పందిస్తారా.. లేదంటే ఏకంగా పెళ్లి వీడియోనే రిలీజ్ చేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇంతకుముందు రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ప్రేమ విషయంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా..  రోకా వేడుక ఇప్పటికే జరిగినట్లు తెలిపారు. “నేను రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ప్రేమ, ఆనందం, సాంగత్యంతో కలిసి మెలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మరోసారి నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్త నిజమేనని చాలా మంది ధృవీకరించారు.

Also Read : 'విరూపాక్ష' రివ్యూ : మిస్టీక్ థ్రిల్లర్‌తో సాయి ధరమ్ తేజ్ భయపెట్టారా? లేదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget