అన్వేషించండి

Panja Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ సాహసం - ఆ డిజస్టర్ డైరెక్టర్‌తో మూవీకి గ్రీన్ సిగ్నల్?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ సాహసం చేస్తున్నాడు. ‘ఏజెంట్’ మూవీతో అఖిల్‌కు భారీ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డితో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

‘ఏజెంట్’ సినిమాతో కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ ను చవి చూశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. నిర్మాతగా తీవ్రంగా నష్టపోయారు. దర్శకుడిగా తన కెరీర్ కు కూడా ఈ చిత్రం పెద్ద డ్యామేజ్ చేసింది. ‘ఏజెంట్’ డిజాస్టర్ తో కోలుకోలేని దెబ్బతిన్న ఆయన, ఇప్పుడిప్పుడే మళ్లీ ఆ చిత్రం చేదు జ్ఞాపకాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథతో బన్నీతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో కలిసి ఆయన ‘రేసుగుర్రం’ సినిమా చేశారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.  

వైష్ణవ్ తేజ్ తో సురేందర్ రెడ్డి కొత్త సినిమా!

ప్రస్తుతం మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన హీరో వైష్ణవ్ తేజ్ కి ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథ ఆయనకు బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ పనులను షురూ చేసినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఈ సినిమా నిర్మాత కోసం ఆయన వెతుకుతున్నారట. మీడియం బడ్జెట్ మూవీగా దీనిని తెరకెక్కించాలని భావిస్తున్నారట సురేందర్ రెడ్డి. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Panja Vaishnav Tej (@panja_vaishnav_tej)

మెగా హీరోలకు మంచి హిట్లు ఇచ్చిన సురేందర్ రెడ్డి

వాస్తవానికి మెగా హీరోలతో సురేందర్ రెడ్డి చేసిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పటికే బన్నీతో ‘రేసుగుర్రం’, రామ్ చరణ్ తో  ‘ధృవ’, చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు.  ఇప్పుడు కూడా తన తర్వాతి ప్రాజెక్టును మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో చేయాలనుకున్నారు. సెంటిమెంట్ ప్రకారం మరో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.   

‘ఆదికేశవ’ షూటింగ్ లో వైష్ణవ్ తేజ్ బిజీ

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్,  శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆదికేశవ’ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్‌లో లో వైష్ణవ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. సితార సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మాస్ మూవీగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అంచనాలను భారీగా పెంచింది. అయితే, సినిమా వచ్చే నెలలో రిలీజ్ అవుతుందని చెప్పినా, ఇప్పటి వరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టలేదు చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విడుదల ఇప్పట్లో లేనట్లేననే టాక్ కూడా నడుస్తోంది. 

Read Also: ‘ధీర’గా వస్తున్న అఖిల్ - బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదట!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget