అన్వేషించండి

Manorathangal: ‘మనోరథంగల్’, ఇండస్ట్రీ అంతా ఒక్కచోట చేరితే అదే ఇది - త్వరలో ZEE5లోకి ఈ క్రేజీ సిరీస్‌

MT వాసుదేవన్ నాయర్ పుట్టినరోజు సందర్భంగా 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో మలయాళ ఇండస్ట్రీలోని అత్యుత్తమ టెక్నీషియన్లంతా కలిసి నిర్మించిన 'మనోరథంగల్' ట్రైలర్‌ను విడుదల చేశారు.

Manorathangal Official Trailer: ఓటీటీలోకి త్వరలోనే ఓ క్రేజీ వెబ్‌ సిరీస్‌ రాబోతుంది. ఇది అంత స్పెషల్‌ అంటే ఈ వెబ్‌ సిరీస్‌లో ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది లెజెండరీ నటులు నటించారు.  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో జీ5లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేసింది జీ5 సంస్థ. నిజానికి ఏదైనా సినిమాలో కానీ, వెబ్‌ సిరీస్‌లో కానీ ఒకరిద్దరు లెజెండరీ నటులు నటిస్తినే ఆ సినిమాపై ఓ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ అవుతుంది అలాంటి ఓ వెబ్‌ సిరీస్‌ కోసం ఏకంగా ఇండస్ట్రీనే కదిలి వచ్చింది.

మోహన్‌ లాల్‌, ముమ్ముట్టి, పహాద్‌ ఫాజిల్‌తో పాటు మరికొందరు మలయాళ దిగ్గజ నటులు నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ పేరు 'మనోరథంగల్'. తొమ్మిది కథలకు ఎనిమిది మంది టాప్ డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, జరీనా, బిజు మీనన్, కైలాష్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ వంటి వారు ఈ తొమ్మిది కథల్లో నటించారు. వీటికి ప్రియదర్శన్, రంజిత్, శ్యామప్రసాద్, జయరాజన్ నాయర్, సంతోష్ శివన్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్ వంటి వారు దర్శకత్వం వహించారు. ఆగస్ట్‌ 15 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ ZEE5లో స్ట్రీమింగ్‌ కానుంది.

అయితే  MT వాసుదేవన్ నాయర్‌కు 90వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ జీ5 సంస్థ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా ZEE5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ZEE5లో రానున్న 'మనోరథంగల్' కోసం మాలీవుడ్ టాలెంట్ అంతా ఒకే చోటుకి చేరింది. సాహిత్య దిగ్గజం, సినిమాటిక్ దూరదృష్టి గల  MT వాసుదేవన్ నాయర్‌ 90వ బర్త్ డే సందర్భంగా ఈ వెబ్ సిరీస్‌ని ప్రకటించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ మలయాళ సినిమా అసాధారణమైన సృజనాత్మకతను అందరికీ చూపించినట్టు అవుతుంది. వీక్షకులు తమ స్థానిక భాషలో చూసేందుకు వీలుగా 'మనోరతంగల్'ని హిందీ, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నాం’అంటూ చెప్పుకొచ్చారు. 

కాగా ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీకి బాగా కలిసోచ్చిందనే చెప్పాలి. ఈ ఇండస్ట్రీలో వచ్చిన నాలుగు సినిమా వరుసగా బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌ కొట్టాయి. నాలుగు సినిమాలు వరుసగా వరల్డ్‌ వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్‌ దాటి మలయాళ ఇండస్ట్రీలో ఎన్నడు లేని విధంగా చరిత్ర సృష్టించాయి. అవే మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు, ఆడు జీవితం.. ఇలా వరసపెట్టి సినిమాలు హిట్ కొట్టాయి. అన్ని కూడా వంద కోట్ల గ్రాస్‌ క్రాస్‌ చేసి సంచలనం రేపాయి. ఇప్పుడు ఈ భాషకు చెందిన లెజెండరీ నటులంతా 'మనోరథంగల్' అనే వెబ్ సిరీస్ నటించారు. రెండేళ్ల నుంచి షూటింగ్ జరుపుకొంటున్న ఈ వెబ్‌ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మలయాళ స్టార్ రైటర్ ఎమ్‌టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో  9 భాగాల అంథాలజీని 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కించడం ఒక విశేషం అయితే... ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ వంటి సినీ దిగ్గజాలు అంత కలిసి నటడించడం ఈ వెబ్‌ సిరీస్‌ మరో ప్రత్యేకత. 

Also Read: రాజ్‌ తరుణ్‌ ఎక్కడ? - విచారణకు హాజరు కావాలని హెచ్చరిస్తూ హీరోకి పోలీసుల నోటీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Embed widget