అన్వేషించండి

OTT Movies: రూ. 500కే హత్య చేసి ఉరికంబం ఎక్కిన బ్రదర్స్- రియల్ స్టోరీ ఆధారంగా తీసిన మూవీ ఏ OTTలో ఉందో తెలుసా?

OTT Movie : నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'బ్లాక్ వారెంట్‌'లో కర్తార్, ఉజాగర్ సింగ్‌ల ఉరితీత అంశం కీలకమైనది. ఇదొక రియల్ స్టోరీ.

Vikramaditya Motwanes Black Warrant | ఎవరికైనా ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్ష పడిందంటే వాళ్ళు క్షమించరాని అతిపెద్ద నేరం చేసి ఉంటారు. కానీ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం ఓ అమ్మాయిని చంపడానికి 500 తీసుకోగా, వారికి కోర్టు ఉరిశిక్ష విధించి షాక్ ఇచ్చింది. మరి 500 తీసుకోవడానికి, ఉరిశిక్ష విధించడానికి మధ్య ఉన్న గ్యాప్ లో ఏం జరిగింది? హత్యకు ప్రధాన కారణమైన వ్యక్తిని వదిలేసి, చేసిన వాళ్ళను కోర్టు ఎందుకు ఉరితీసింది ?... ఈ రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన సిరీస్ 'బ్లాక్ వారెంట్'. 

వాస్తవ సంఘటనల ఆధారంగా...
జహాన్ కపూర్ వెబ్ సిరీస్ 'బ్లాక్ వారెంట్' నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతోంది. ఢిల్లీలోని తీహార్ జైలులో పనిచేసిన సునీల్ కుమార్ గుప్తా, జర్నలిస్టు సునేత్ర చౌదరితో కలిసి ఆరేళ్ల క్రితం ‘బ్లాక్ వారెంట్: కన్ఫెషన్స్ ఆఫ్ ఏ తీహార్ జైలర్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగానే 'బ్లాక్ వారెంట్' సిరీస్ రూపొందింది. 

ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఇద్దరు సోదరులు ఓ ప్రముఖ డాక్టర్ భార్యను చంపారు. డాక్టర్ జైన్ అనే వ్యక్తి అసిస్టెంట్ తో ఎఫైర్ కారణంగా, తన భార్యను మనుషుల్ని పెట్టి మరీ చంపించాడు. ఆ తర్వాత హత్యకు కారణమైన అసలు వ్యక్తిని పక్కన పెట్టేసి, మిగిలిన ఇద్దరికీ కోర్టు ఉరిశిక్ష విధించింది. డాక్టర్ జైన్, అతని అసిస్టెంట్ చంద్రేష్ శర్మ, కర్తార్, ఉజాగర్ ఈ కేసులో ప్రధాన నిందితులు. అలాగే రాకేష్ కౌశిక్, భగీరథ్, కళ్యాణ్ గుప్తా అనే ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకి హెల్ప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక డాక్టర్ భార్య విద్యను హత్య చేసినందుకు ఉజాగర్ సింగ్ పై సెక్షన్ 302, కర్తార్ పై ఆయుధాల చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం కేసు నమోదు చేశారు. కళ్యాణ్, భగీరథ మినహా మిగిలిన నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేయగా, కర్తార్, ఉజాగర్ తో సహ మిగిలిన నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది. కానీ హత్య వెనక ప్రధాన సూత్రధారులైన డాక్టర్ జైన్, చంద్రేష్ లను మాత్రం తప్పించారు. ఈ మేరకు కర్తార్, ఉజాగర్ లకు బ్లాక్ వారెంట్ ఇచ్చారు.

500 లకే హత్య, ఉరిశిక్ష  
పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు సోదరులు ఉజాగర్, కర్తార్ డబ్బు కోసం ఈ హత్యను చేయడానికి ఒప్పుకున్నారు. డబ్బు లేకపోవడం వల్ల డాక్టర్ వీరికి రూ. 25000 ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో ఆ డబ్బు కోసం హత్య చేయడానికి ముందుకు వచ్చారు. పైగా వారితో పాటు మరో ముగ్గురిని కలుపుకుని, ఐదుగురు కలిసి ఆ డబ్బును పంచుకోవాలి అనుకున్నారు ఈ ఇద్దరు సోదరులు. ఈ మేరకు డాక్టర్ దగ్గర అడ్వాన్స్ గా కేవలం రూ. 500 మాత్రమే తీసుకున్నారట. 
1973లో జరిగిన ఈ ఘటనలో ఉజాగర్ సింగ్ విద్యను దాదాపు 14 సార్లు కత్తితో పొడిచాడు. డాక్టర్ జైన్ సమక్షంలోనే ఈ హత్య జరగగా, కర్తార్ కూడా హెల్ప్ చేసినట్టు తెలుస్తోంది. ఒళ్ళు గగుర్పాటు పొడిచేలా ఉన్న ఈ హత్య కేసు ఆధారంగా తాజాగా 'బ్లాక్ వారెంట్' అనే సిరీస్ ను రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా  కర్తార్, ఉజాగర్ లను 1983 అక్టోబర్ 9న ఉరి తీశారు. వీరిద్దరిని ఉరి తీసిన తర్వాత డాక్టర్ జైన్, చంద్రేష్ శర్మ బయటకు వచ్చారు. చరిత్రపుటల్లో కర్తార్, ఉజాగర్ ల కేసు ఇప్పటికీ సంచలనమే. ఈ సిరీస్ లో 1982 నుంచి 1985 ఉరితీసిన 5 మంది నిందితుల స్టోరీని చూపించారు. 

Read Also : స్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన ఒక్క తప్పు... ఆ రాత్రంతా జైల్లోనే... ఇప్పుడు ఛాన్సుల్లేవ్, ఆవిడ ఎవరో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Indonesian Hindu Religious Rights : ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
Embed widget