Vikkatakavi Web Series: తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి' - ఏ ఓటీటీలో రిలీజ్, హీరో హీరోయిన్లు ఎవరంటే?
ZEE5 original web series Vikkatakavi: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 రూపొందిస్తున్న తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి'. ఆ సిరీస్ కాస్ట్ అండ్ క్రూ వివరాలు...
Vikkatakavi Web Series: వికటకవి... ప్రేక్షకులు ఎప్పటి నుంచో కథల్లో వింటున్న పేరు. ఇప్పుడీ పేరు ఓ వెబ్ సిరీస్ టైటిల్ అయ్యింది. భారతీయులకు వైవిధ్యమైన వెబ్ షోలు, సినిమాలు అందిస్తున్న 'జీ 5' ఓటీటీ వేదిక 'వికటకవి' వెబ్ సిరీస్ వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. లేటెస్టుగా ఈ సిరీస్ ఫస్ట్ లుక్, కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అనౌన్స్ చేశారు.
తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్!
తెలంగాణ నేపథ్యంలో ఇటీవల మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలంగాణ నేపథ్యంలో కొన్ని వెబ్ సిరీస్‌లు సైతం వస్తున్నాయి. అయితే, 'వికటకవి' స్పెషల్ ఏమిటంటే... తొలి తెలంగాణ డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇది.
📢 Ugadi special Announcement Alert📢:
— ZEE5 Telugu (@ZEE5Telugu) April 8, 2024
Step into the intriguing world of "Vikkatakavi," the first Telangana-based detective series! Join Detective Ramakrishna as he unravels the secrets of the cursed village of "Amaragiri" in the Nallamalla forest. pic.twitter.com/Iq00zUmqxQ
'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం', 'మెన్ టూ', మాయలో' సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు నరేష్ అగస్త్య (Naresh Agastya). 'వికటకవి'లో ఆయన హీరో. నరేష్ అగస్త్య జోడీగా మేఘా ఆకాష్ (Megha Akash) నటిస్తున్నారు. దీనిని ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?
నల్లమలలో అమరగిరి...
అక్కడ శాపం ఏమిటి?
నల్లమల అటవీ ప్రాంతంలో అమరగిరి అని ఓ గ్రామం ఉంది. హైదరాబాద్ విలీనం తర్వాత ఆ ఊరిని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. ఆ అమరగిరికి డిటెక్టివ్ రామకృష్ణ (నరేష్ అగస్త్య) వెళతాడు. ఆ ఊరికి సంబంధించిన పురాతన కథలతో పాటు ఆధునిక కుట్రల వెనుక ఉన్న రహస్యాలు బయటకు తీస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో నీటి మట్టం పెరగడం వల్ల కనుమరుగైన కొన్ని సత్యాలను, ఎవరికీ తెలియకుండా రహస్యంగా మిగిలిన వివరాలను చేధించడానికి డిటెక్టివ్ రామకృష్ణ ఎటువంటి పోరాటం చేశాడు? ఆ ప్రయాణంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది తెలుసుకోవాలని అనుకుంటే 'వికటకవి' సిరీస్ చూడాలి.
Also Read: ఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న 'వికటకవి'లో సిజ్జు అబ్దుల్ రషీద్, తారక్ పొన్నప్ప, రమ్యా రామకృష్ణన్, నటుడు - సంగీత దర్శకుడు రఘు కుంచె, రషా కిర్మాణి, అమిత్ తివారి, రవితేజ నన్నిమాల, గిరిధర్, సంతోష్ యాదవ్, సాయి ప్రసన్న, అశోక్ కుమార్ .కె ఇతర ప్రధాన తారాగణం. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే... కాస్యూమ్స్: జె. గాయత్రీ దేవి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, కళా దర్శకత్వం: కిరణ్ మామిడి, ఛాయాగ్రహణం: షోయబ్ సిద్ధికీ, కూర్పు: సాయిబాబు తలారి, సంగీతం: అజయ్ అరసాడ, కథ - కథనం - మాటలు: తేజ దేశ్‌రాజ్, నిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: రామ్ తాళ్లూరి, దర్శకత్వం - ప్రదీప్ మద్దాలి.