అన్వేషించండి

ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!

సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించిన ‘కణ్మని రాంబో ఖతీజా’ తమిళ వెర్షన్ మరికొద్ది రోజుల్లో ఓటీటీలో సందడి చేయనుంది. అదే రోజు తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

విజయ్ సేతుపతి, సమంత, నయన తార నటించిన ‘కాతువాక్కుల రెండు కాదల్‌’(కణ్మని రాంబో ఖతీజా) సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్, ఆ సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా వెరైటీగా వెల్లడించారు. అయితే, ఈ చిత్రాన్ని తెలుగులో ‘కణ్మని రాంబో ఖతీజా’ టైటిల్‌తో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఓటీటీలో తమిళంతోపాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదల చేస్తారా? లేదా అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించే అమాయక ప్రేమికుడిగా నటిస్తున్నాడు. రేఖపల్లి ఆనందరాజు మదనగోపాల భోగేశ్వరుడు (విజయ్ సేతుపతి) అలియాస్ రాంబోకు తను దురదృష్టవంతుడిని అని నమ్మకం. తను పుట్టినరోజే తండ్రి చనిపోవడం, తల్లి మంచానికే పరిమితం కావటంతో రాంబో ఊరికి దూరంగా ఉంటాడు. కన్మణి(నయనతార), కతీజా(సమంత) రాకతో తన జీవితంలో సంతోషం కనిపిస్తుంది. తనకు తెలియకుండానే ఇద్దరిని ప్రేమిస్తాడు రాంబో. అయితే తను చేస్తోంది తప్పు అనే అపరాధభావన కలుగుతుంది. అప్పుడు రాంబో ఏం చేశాడు? ఇద్దరిలో ఎవరిని ఎంచుకున్నాడు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Also Read: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. కాసేపు కడుపుబ్బా నవ్వుకోవాలంటే ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు. ‘కాతువాక్కుల రెండు కాదల్‌’ (Kaathuvaakula Rendu Kaadhal) చిత్రం మే 27 నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది. ‘కణ్మని రాంబో ఖతీజా’ (Kanmani Rambo Khatija) చిత్రం కూడా అదే రోజు విడుదలయ్యే అవకాశాలున్నాయి. దీనిపై స్పష్టత రావల్సి ఉంది. 

Also Read: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

View this post on Instagram
 
A post shared by Vignesh Shivan (@wikkiofficial)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget