Rana Naidu Web Series: షూటింగ్‌కు ముందు వెంకటేష్‌తో రిహార్సల్స్ చేశా, ఆయన చాలా ఫ్రెండ్లీ - ముకుల్ చద్దా
Actor Mukul Chadda On Working With Venkatesh and Rana Naidu Web Series: బాబాయ్ అండ్ అబ్బాయ్ వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న 'రానా నాయుడు' గురించి బాలీవుడ్ నటుడు ముకుల్ చద్దా ఏమన్నారంటే...
విక్టరీ వెంకటేష్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని, ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, ఎంతో మంచి వ్యక్తి అని బాలీవుడ్ యాక్టర్ ముకుల్ చద్దా అంటున్నారు. తామిద్దరం చెన్నైలో చదుకోవడం వల్ల ఆ సిటీ గురించి డిస్కషన్స్ ఎక్కువ జరిగాయని అంటున్నారు. ఇంతకీ, వెంకీతో ఆయన ఎందుకు కలిశారంటే...
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. బాబాయ్, అబ్బాయ్ పూర్తిస్థాయి పాత్రల్లో నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతోన్న ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో ముకుల్ చద్దా కీలక పాత్రలో నటించారు. పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవన్'కు ఇండియన్ అడాప్షన్ ఇది.
'రానా నాయుడు' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ముకుల్ చద్దా మాట్లాడుతూ ''వెంకటేష్, రానాతో నటించడం అసాధారణ అనుభవం. ఇద్దరూ చాలా ప్రొఫెషనల్స్. వాళ్ళతో రిలాక్డ్స్‌గా నటించారు. నాకు వెంకటేష్ గారితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు హైదరాబాద్ వచ్చి ఆయనతో రిహార్సిల్స్ చేశా. ఆయన చాలా మంచి వ్యక్తి'' అని అన్నారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు నన్ను చూసిన పాత్రలకు భిన్నమైన పాత్రను 'రానా నాయుడు'లో చేశానని ఆయన తెలిపారు.
Also Read : నీళ్ల ట్యాంక్ ఎక్కిన ఎమ్మెల్యే కొడుకు - పాన్ ఇండియా ఫ్యాన్స్ వెతుకుతారా?
'షెర్ని', 'ది ఆఫీస్', 'సన్ ఫ్లవర్' తదితర సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ముకుల్ చద్దా నటించారు. 'ది ఆఫీస్'లో జగ్‌దీప్ చద్దా పాత్ర ఆయనకు పేరు తీసుకొచ్చింది.
Also Read : గుండెపోటుతో సీనియర్ నటి అంబికా రావు మృతి
View this post on Instagram